WoW! Game Changer Release Date Fixed l మొత్తానికి గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ 2024

Written by Movie Updates

Published on:

Game Changer Release Date Fixed:- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ చేస్తున్నారు. ఇటీవల మరొక స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి RRR మూవీలో నటించారు రామ్ చరణ్ (Ram Charan). బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న RRR మూవీ తో గ్లోబల్ స్టార్స్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు భారీ క్రేజ్ లభించింది. దానితో వారిద్దరి నెక్స్ట్ మూవీస్ పై అందరిలో భారీ క్రేజ్ ఏర్పడ్డాయి.

Game Changer Release Date Fixed

ఇక ప్రస్తుతం శంకర్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు చరణ్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా దీనిని భారీ యాక్షన్ తో కూడిన పొలిటికల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో అంజలి,ఎస్ జె సూర్య, సునీల్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు.

అందుతున్న లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ ఇప్పటికే 70 శాతం వరకు షూటింగ్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు కమల్ హాసన్ తో భారతీయుడు 2 మూవీ తీస్తున్నారు శంకర్. ఆ మూవీ వచ్చే ఏడాది ఆగష్టు లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన Salaar మూవీ యొక్క ప్రీమియర్ షో వీక్షించిన దిల్ రాజు, గేమ్ ఛేంజర్ మూవీ యొక్క రిలీజ్ డేట్ గురించి మాట్లాడారు.

Game Changer Release Date Fixed

ఆయన మాట్లాడుతూ ఆ మూవీని 2024 సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నాట్లు తెలిపారు. అయితే పక్కాగా మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు అయితే ఆగాల్సిందే అని తెలుస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ నుండి త్వరలో జరగండి అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలున్నాయి.

Game Changer Release Date Fixed

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Game Changer Release Date Fixed

1 thought on “WoW! Game Changer Release Date Fixed l మొత్తానికి గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ 2024”

Comments are closed.