Mahesh Punch with Guntur Kaaram was Sure l గుంటూరు కారం తో మహేష్ గుద్ది పారేయడం ఖాయమట 2024

Written by Movie Updates

Published on:

Mahesh Punch With Guntur Kaaram Was Sure:- సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా గుంటూరు కారం పై సూపర్ ఫ్యాన్స్ తో పాటు పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో చాలా ఏళ్ళ తరువాత మహేష్ బాబు ఊర మాస్ పాత్ర చేస్తుండగా ఆయనకు మంచి స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇక మరొక విషయం ఏమిటంటే, దాదాపుగా పుష్కర కాలం తరువాత మహేష్, త్రివిక్రమ్ కలిసి ఈ మూవీ చేస్తుండడం.

ఇక గుంటూరు కారం మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ టీజర్, అలానే ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా, సెకండ్ సాంగ్ ఓ మై బాబీ, ఇలా అన్ని కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. మహేష్ కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రఘుబాబు, బ్రహ్మానందం, సునీల్, ఆలీ, హైపర్ ఆది, మహేష్ ఆచంట తదితరులు నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ వేగంగా జరుగుతోంది.

Mahesh Punch With Guntur Kaaram Was Sure

కాగా గుంటూరు కారం మూవీని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి మిగిలిన రెండు సాంగ్స్ తో పాటు ఒక బిట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వీటి అనంతరం థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసి, ఆ తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఫ్యాన్స్, ఆడియన్స్ సమక్షంలో నిర్వహించనున్నారట.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం, గుంటూరు కారం మూవీతో సూపర్ స్టార్ మహేష్ బాబు పలు రికార్డులని బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు మేకర్స్. హీరోగా ఈ మూవీ ఆయనకు మరింతగా విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెడుతుందని, ముఖ్యంగా ఈ మూవీలో ఆయన పోషిస్తున్న వైరా వెంకట రమణారెడ్డి పాత్రని త్రివిక్రమ్ అద్భుతంగా డిజైన్ చేయగా అంతకుమించి మహేష్ బాబు ఈ పాత్రలో అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేసారని అంటున్నారు.

Mahesh Punch With Guntur Kaaram Was Sure

ఇక థమన్ సాంగ్స్ తో పాటు స్క్రీన్ పై బీజీఎమ్ కూడా అదిరిపోతుందట. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, భారీ మాస్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు, ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతి ఒక్క అంశాన్ని జోడించి దర్శకుడు త్రివిక్రం గుంటూరు కారం మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ చూడదగ్గ మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారట. ఇక గుంటూరు కారంతో మహేష్ బాబు గుంటూరు ని అలానే అన్ని ఏరియాలని గుద్దేయడం ఖాయం అంటున్నారు.

Mahesh Punch with Guntur Kaaram was Sure

మరిన్ని మూవీ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Mahesh Punch With Guntur Kaaram Was Sure