Tollywood Top 10 Directors l టాలీవుడ్ టాప్ 10 డైరెక్టర్స్ 2024

Written by Movie Updates

Published on:

Tollywood Top 10 Directors:- తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు అనేకమంది దిగ్గజ దర్శకులు వచ్చారు వెళ్లారు. అయితే వారిలో కొందరు పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ మరికొందరు తమ అత్యద్భుత దర్శకత్వ ప్రతిభతో ఎందరో ఆడియన్స్ యొక్క మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. తెలుగు సినిమా ప్రారంభంలో బి ఎన్ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, కెవి రెడ్డి, యోగానంద్, వి మధుసూధనరావు, కమలాకర కామేశ్వరరావు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది ఉన్నారు.

అనంతరం వచ్చిన వారిలో దాసరి నారాయణరావు, కె విశ్వనాధ్, కె రాఘవేంద్ర రావు, ఏ కోదండరామిరెడ్డి వంటి వారు కూడా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో కూడా కొందరు దర్శకులు పలు అద్భుతమైన సినిమాలు తీస్తూ తమదైన ఆకట్టుకునే శైలితో ఎందరో ప్రేక్షకాభిమానుల నుండి మంచి పేరు అందుకుంటూ కొనసాగుతున్నారు. మరి వారు ఎవరో, వారిలో ఎవరెవరు ఏవిధమైన క్రేజ్ అందుకుని కొనసాగుతున్నారో ఇప్పుడు చూద్దాం.

1. ఎస్ ఎస్ రాజమౌళి : (S. S. Rajamouli)

అందరూ ముద్దుగా జక్కన్న గా పిలుచుకునే రాజమౌళి తొలిసారిగా 2002లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో టాలీవుడ్ కి దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు. ఆ విధంగా ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి, ఆ తరువాత మరొక్కసారి ఎన్టీఆర్ తో సింహాద్రి మూవీ తీసి మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక అక్కడి నుండి వరుసగా అనేక సినిమాలతో తన సినీ ప్రస్థానాన్ని దర్శకుడిగా మరింతగా ముందుకు నడిపించిన రాజమౌళి ఒక్కో సినిమాతో కూడా ఒక్కో విజయాన్ని తన కథలో వేసుకున్నారు. ఇటీవల ప్రభాస్ హీరోగా తమన్నా, అనుష్క శెట్టి హీరోయిన్స్ గా తొలిసారిగా రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మూవీస్ బాహుబలి 1, బాహుబలి 2 ఒకదానిని మించేలా మరొకటి అద్భుత విజయాలు సొంతం చేస్కుని తెలుగు సినిమా ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటి చెప్పాయి. ముఖ్యంగా ఇండియాలో ఆ రెండు సినిమాలు ఎంతో గొప్పగా కలెక్షన్ అందుకున్నాయి.

ఇక ఇటీవల ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ మరింత గొప్ప విజయం అందుకోవడంతో పాటు అందులోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డు ని గెలుచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన తదుపరి SSMB 29 మూవీ చేయనున్నారు రాజమౌళి.

2. త్రివిక్రమ్ శ్రీనివాస్ : (Trivikram Srinivas)

తెలుగు సీనియా పరిశ్రమకు మొదట కథ, డైలాగ్ రైటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు త్రివిక్రమ్. తొలిసారిగా వేణు తొట్టెంపూడి హీరోగా లయ హీరోయిన్ గా విసయభాస్కర్ దర్శకత్వంలో 1999లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ స్వయంవరం కి కథ, మాటలు అందించి అందరినీ ఆకట్టుకున్నారు త్రివిక్రమ్.

ఆ తరువాత పలు సినిమాలకు కూడా కథ, డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్ ఆపైన తరుణ్, శ్రియ కలిసి నటించిన నువ్వే నువ్వే మూవీతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు. ఆ మూవీ మంచి విజయం అందుకుంది. అనంతంగా ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో అతడు మూవీ చేసి మరొక విజయం అందుకున్నారు త్రివిక్రమ్. ఇక అక్కడి నుండి తన కేరీర్ ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఆపైన పవన్ కళ్యాణ్ తో తీసిన జల్సా, అల్లు అర్జున్ తో తీసిన జులాయి సినిమాలతో కూడా విజయాలు అందుకున్నారు త్రివిక్రమ్.

ఇక తన కెరీర్ లో మధ్యలో పలు ఫ్లాప్ లు కూడా చవిచూశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ తో ఆయన తీసిన అజ్ఞాతవాసి మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ఎన్టీఆర్ తో అరవింద సమేత, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాలతో మరొక రెండు భారీ విజయాలు అందుకున్నారు త్రివిక్రమ్. తాజాగా మహేష్ బాబుతో మరొక హిట్ మూవీ గుంటూరు కారం చేసారు. త్వరలో అల్లు అర్జున్ తో మరొక మూవీ చేసేందుకు సిద్దము అవుతున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

3. సుకుమార్ : Sukumar

తొలిసారిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య మూవీతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు సుకుమార్. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 2004లో రూపొందిన ఆర్య మూవీ అప్పట్లో మంచి విజయం అందుకుని అటు అల్లు అర్జున్ కి ఇటు సుకుమార్ కి బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఆ తరువాత వరుసగా కెరీర్ పరంగా సినిమాలు చేస్తూ కొనసాగారు త్రివిక్రమ్.

రెండవ సినిమాగా రామ్ తో జగడం చేసారు. అయితే అది ఫ్లాప్ అయింది. ఆ తరువాత చేసిన ఆర్య 2 కూడా పెద్దగా ఆడలేదు. 2011 లో నాగచైతన్య, తమన్నా లతో సుకుమార్ తీసిన 100% లవ్ మంచి విజయవంతం అయి ఆయనకు పెద్ద సక్సెస్ అందించింది. అనంతరం మహేష్ బాబుతో సుకుమార్ తీసిన వన్ నేనొక్కడినే కూడా ఫ్లాప్ అయింది. ఆపైన ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో తో మంచి విజయం అందుకున్నారు సుకుమార్. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో 2018లో సుకుమార్ తీసిన రంగస్థలం మూవీ పెద్ద సక్సెస్ అందుకుని హీరోగా రామ్ చరణ్ కు అలానే డైరెక్టర్ గా సుకుమార్ కు పెద్ద బ్రేక్ అందించింది.

Tollywood Top 10 Directors

ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తొలిసారిగా తన కెరీర్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప తీసి అందరినీ ఆకట్టుకున్నారు సుకుమార్. పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడంతో పాటు అందులో పుష్ప రాజ్ గా అద్భుత నటన కనబరిచిన అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం పుష్ప 2 మూవీ తీస్తున్నారు సుకుమార్

4. కొరటాల శివ : (Koratala Siva)

తొలిసారిగా 2002 లో జి నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన గర్ల్ ఫ్రెండ్ మూవీకి కథని అందించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు కొరటాల శివ. ఆ తరువాత భద్ర, మున్నా సినిమాలకు డైలాగ్స్ రాసిన శివ అనంతరం 2013లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి మూవీతో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టారు. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఆ మూవీ అప్పట్లో మంచి సక్సెస్ సొంతం చేసుకుంది.

అనంతరం 2015లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన శ్రీమంతుడు మూవీతో ఏకంగా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ అందుకున్న కొరటాల. ఆపైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆయన తీసిన జనతా గ్యారేజ్ మూవీ కూడా సూపర్ హిట్ కొట్టింది. దాని అనంతరం మరొక్కసారి టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కొరటాల తీసిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భరత్ అనే నేను కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

అయితే భరత్ అనే నేను తరువాత కొంత గ్యాప్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో కొరటాల శివ తీసిన ఆచార్య మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం మరొక్కసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ మాస్ యాక్షన్ తో కూడిన పాన్ ఇండియన్ మూవీ దేవర తీస్తున్నారు కొరటాల శివ. బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

5.  అనిల్ రావిపూడి : (Anil Ravipudi)

2009లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన శంఖం మూవీకి డైలాగ్ రైటర్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు అనిల్ రావిపూడి, తరువాత పలు సినిమాలకు డైలాగ్స్ అందించిన అనిల్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల తీసిన ఆగదు మూవీకి స్క్రీన్ ప్లే అందించారు. అనంతరం యువ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ మూవీ ద్వారా తొలిసారిగా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి మంచి హిట్ అందుకున్నారు.

ఆ తరువాత మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో ఆయన తీసిన సుప్రీం మూవీ కూడా సక్సెస్ సొంతం చేసుకుంది. ఆపైన మాస్ మహారాజా రవితేజ తో అనిల్ రావిపూడి తీసిన రాజా ది గ్రేట్, అలానే వెంకటేష్ వరుణ్ తేజ్ ల తో తీసిన ఎఫ్ 2 సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. అయితే అదే సమయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు మూవీ తీసే ఛాన్స్ రావడం, రిలీజ్ అనంతరం అది పెద్ద విజయం అందుకోవడం జరిగింది.

ఇక దాని తరువాత ఎఫ్ 2 సీక్వెల్ అయిన ఎఫ్ 3 మూవీ తీసి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. ఇక దాని అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ తో అనిల్ రావిపూడి తీసిన భగవంత్ కేసరి కూడా మంచి విజయం అందుకుంది. టాలీవుడ్ లో ఎస్ ఎస్ రాజమౌళి తరువాత దర్శకుడిగా తన కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా విజయవంతమైన దర్శకుడిగా ముందుకు సాగుతున్నారు అనిల్ రావిపూడి. అతి త్వరలో ఆయన తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయనున్నారు.

6. బోయపాటి శ్రీను : (Boyapati Srinu)

2005లో మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా రూపొందిన భద్ర మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా మెగాఫోన్ పట్టి ఎంట్రీ ఇచ్చారు బోయపాటి శ్రీను. ఆ మూవీ అప్పట్లో అతి పెద్ద విజయం అందుకుని దర్శకుడిగా బోయపాటి కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అనంతరం విక్టరీ వెంకటేష్ తో ఆయన తీసిన తులసి మూవీ కూడా పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది.

ఆపైన నటసింహం నందమూరి బాలకృష్ణ తో సింహా మూవీ తీసి మరొక విజయం అందుకున్నారు బోయపాటి. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆయన తీసిన దమ్ము మాత్రం ఫ్లాప్ అయింది. ఆ తరువాత బాలకృష్ణ తో లెజెండ్, అల్లు అర్జున్ తో సరైనోడు మూవీస్ తో మరొక రెండు విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు బోయపాటి శ్రీను. అయితే ఆ తరువాత యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో బోయపాటి తీసిన జయ జానకి నాయక, వినయ విధేయ రామ్ మూవీస్ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.

అనంతరం రెండేళ్ల తరువాత ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ తో బోయపాటి తీసిన అఖండ మూవీ పెద్ద సక్సెస్ సొంతం చేసుకుని మళ్ళి ఆయనకు మంచి బ్రేక్ ని అందించింది. అయితే ఇటీవల రామ్ తో బోయపాటి తొలిసారిగా తీసిన పాన్ ఇండియన్ మూవీ స్కంద మాత్రం పెద్దగా ఆడలేదు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్, బాలకృష్ణ లతో సినిమాలు చేసేందుకు సంసిద్ధం అవుతున్నారు బోయపాటి.

7. పూరి జగన్నాథ్

2000వ సంవత్సరం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి మూవీతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టి ఫస్ట్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు పూరి జగన్నాథ్. ఆ తరువాత జగపతి బాబు తో బాచి మూవీ తీసారు. ఆపైన రవితేజ తో ఆయన తీసిన ఇడియట్ మూవీ పెద్ద విజయం అందుకుని దర్శకుడిగా మంచి బ్రేక్ ని అందించింది. అనంతరం మరొకసారి రవితేజ తో తీసిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ కూడా విజయవంతం అయింది.

అక్కడి నుండి కెరీర్ పరంగా అనేక సినిమాల్తో దూసుకెళ్లారు పూరి జగన్నాథ్. ఇక 2006లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పూరి తీసిన పోకిరి మూవీ అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఆయనకు దర్శకుడిగా విశేషమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత తొలిసారిగా అల్లు అర్జున్ తో దేశముదురు మూవీ తీసి మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు పూరి. ఆతరువాత కొన్ని ఫ్లాప్స్ చవిచూసిన పూరి జగన్నాథ్, 2012లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరొక్కసారి తీసిన బిజినెస్ మ్యాన్ మూవీతో మరొక విజయం అందుకుని కెరీర్ పరంగా మళ్ళి బ్రేక్ సొంతం చేసుకున్నారు.

అయితే ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు, రవితేజ తో నేనింతే, దేవుడు చేసిన మనుషులు, ప్రభాస్ తో ఏ నిరంజన్ ఇలా వరుసగా అనేక అపజయాలు మూటగట్టుకున్న పూరి జగన్నాథ్ కి ఆతరువాత ఎన్టీఆర్ తో తొలిసారిగా తీసిన టెంపర్ మూవీ విజయం బాగా ప్లస్ అయింది. అయితే ఆ తరువాత కూడా ఫ్లాప్స్ అందుకున్నారు పూరి. ఇక ఇటీవల రామ్ హీరోగా రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ విజయం మంచి జోష్ ని అలానే బ్రేక్ ని అందించింది. కాగా ఇటీవల విజయ్ దేవరకొండ తో ఆయన తీసిన లైగర్ మూవీ కూడా పరాజయం పాలయింది. ప్రస్తుతం రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ మూవీ తీస్తున్నారు పూరి జగన్నాథ్.

Tollywood Top 10 Directors

8. శేఖర్ కమ్ముల : (Sekhar Kammula)

తొలిసారిగా తన అమిగోస్ క్రియేషన్స్ సంస్థ పై 2000వ సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ అనే మూవీ తీశారు శేఖర్ కమ్ముల. అయితే అది పెద్దగా ఆడలేదు. అనంతరం రాజా, కమలిని ముఖర్జీ లతో ఆయన తీసిన ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా బాగా సక్సెస్ అయి దర్శకుడిగా శేఖర్ కమ్ములకు గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తరువాత సుమంత్ తో తీసిన గోదావరి తో మరొక విజయం అందుకున్నారు శేఖర్.

ఇక 2007లో అప్పట్లో అంతా కొత్త నటీనటులతో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ మూవీ అతి పెద్ద సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. ఆ మూవీ మరియు సాంగ్స్ ఎంతో గొప్ప పాపులర్ అయ్యాయి. అక్కడి నుండి దర్శకుడిగా శేఖర్ కమ్ములకి మరింత పేరు లభించింది. ఆ తరువాత రానా దగ్గుబాటి డెబ్యూ మూవీ లీడర్ తో మరొక విజయం అందుకున్నారు. అనంతరం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక మూవీస్ తో ఫ్లాప్ లు చవిచూశారు.

అయితే ఆ తరువాత మూడేళ్ళ అనంతరం వరుణ్ తేజ్, సాయి పల్లవి లతో శేఖర్ కమ్ముల తీరిన ఫిదా మూవీ పెద్ద సక్సెస్ అందుకుని ఆయనకు దర్శకుడిగా పునర్వైభవం తెచ్చిపెట్టింది. ఇటీవల నాగచైతన్య, సాయి పల్లవిలతో శేఖర్ కమ్ముల తీసిన లవ్ స్టోరీ మూవీ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ధనుష్, నాగార్జున లతో పెద్ద మల్టీస్టారర్ మూవీ చేస్తునాన్రు శేఖర్ కమ్ముల. క్లాస్ డైరెక్టర్ గా ఏ సెంటర్ ఆడియన్స్ లో మంచి పేరు కలిగిన శేఖర్ కమ్ముల తొలిసారిగా ఈ ఇద్దరు స్టార్ నటులతో ఎటువంటి మూవీ తీస్తారో చూడాలి మరి.

9. క్రిష్ జాగర్లమూడి : (Krish Jagarlamudi)

తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు అరుదైన హృద్యమైన సినిమాలు తీసే దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి కూడా ఒకరు. తొలిసారిగా శర్వానంద్, కమలిని ముఖర్జీ, అల్లరి నరేష్ లతో ఆయన తీసిన గమ్యం మూవీ అప్పట్లో మంచి విజయం అందుకుని దర్శకుడిగా ఫస్ట్ మూవీతోనే బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత అల్లు అర్జున్, మనోజ్, అనుష్క శెట్టిలతో ఆయన తీసిన వేదం కూడా విజయవంతం అయింది.

ఆ తరువాత రానా దగ్గుబాటి తో తీసిన కృష్ణం వన్డే జగద్గురుమ్ కూడా విజయవంతం అవడంతో దర్శకుడిగా మంచి పేరు అందుకున్నారు క్రిష్ జాగర్లమూడి. ఆపైన వరుణ్ తేజ్ తో తీసిన కంచె, బాలకృష్ణ తో తీసిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలతో మరొక రెండు విజయాలు అందుకున్నారు. అయితే ఆ తరువాత సీనియర్ ఎన్టీఆర్ గారి బయోపిక్ లుగా తెరకెక్కిన ఎన్టీర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు రెండూ మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దయా ఆడలేదు.

వాటి తరువాత యువ మెగా నటుడు పంజా వైష్ణవ్ తేజ్ తో క్రిష్ తీసిన కొండపొలం మూవీ పర్వాలేదనిపిపించింది. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలిసారిగా ఆయన తీస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదే ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక క్రిష్ నుండి సినిమా వస్తుంది అంటే అందులో తప్పకుండా హృద్యమైన ఎమోషనల్ అంశాలు ఉంటాయి, అవి తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటాయి అని కొన్ని వర్గాల ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉంటారు.

10. వంశీ పైడిపల్లి : (Vamshi Paidipally)

ప్రస్తుత టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో వంశీ పైడిపల్లి కూడా ఒకరు. తన కెరీర్ ని ఈశ్వర్, భద్ర మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం మొదలెట్టారు వంశీ పైడిపల్లి. ఆ తరువాత ఆయన టాలెంట్ గుర్తించిన నిర్మాత దిల్ రాజు ఆయనకు తొలిసారిగా ప్రభాస్ హీరోగా మున్నా సినిమా తో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. 2007లో ప్రభాస్, ఇలియానా జంటగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది.

ఆ తరువాత మూడేళ్ళ విరామం తీసుకున్న వంశీ పైడిపల్లి అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఆ మూవీలో సమంత, కాజల్ హీరోయిన్స్ గా నటించారు. ఆపైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఎవడు మూవీ తీసి మరొక విజయం అందుకున్నారు. అంతర్మ నాగార్జున, కార్తీ లతో వంశీ పైడిపల్లి తీసిన ఊపిరి మూవీ మంచి విజయం అందుకుని దర్శకుడిగా ఆయనకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది.

అనంతరం ఏకంగా టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి మహర్షి మూవీ తీశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుని దర్శకుడిగా వంశీ కి బాగా పేరు తీచిపెట్టింది. అలానే మహర్షి మూవీ బెస్ట్ పాపులర్ ఎంటెర్టైమెంట్ తెలుగు ఫిలిం గా నేషనల్ అవార్డు అందుకుంది. ఇక దాని తరువాత ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి తీసిన వరుస మూవీ తెలుగులో వారసుడు గా డబ్ అయి ఇక్కడ కూడా విజయవంతం అయింది. అయితే దర్శకుడిగా వంశీ పైడిపల్లి తన నెక్స్ట్ మూవీని మాత్రం అనౌన్స్ చేయాల్సి ఉంది.

Tollywood Top 10 Directors

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tollywood Top 10 Directors