WoW ! Guntur Kaaram Boxoffice Collection Storm l బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న గుంటూరు కారం 2024

Written by Movie Updates

Published on:

Guntur Kaaram Boxoffice Collection Storm:- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచి ఇటీవల జనవరి 12న సంక్రాంతి కానుకగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ అందుకుంది. అయితే కొందరు కావాలనే మూవీ పై నెగటివ్ కామెంట్స్ చేయడంతో పాటు మూవీ పై పనిగట్టుకుని విమర్శలని ఎక్కుపెట్టడం జరిగింది.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్డంతో ఓపెనింగ్స్ పరంగా పెద్ద కలెక్షన్ సునామి సృష్టించిన ఈ మూవీ కథ, కథనాలు ఆకట్టుకోవడంతో మెల్లగా అన్ని వర్గాల ఆడియన్స్ మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ తో కూడా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీని గ్రాండ్ లెవెల్లో హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.

Guntur Kaaram Boxoffice Collection Storm

ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీకి మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రావు రమేష్, మురళి శర్మ, ఈశ్వరి రావు, రఘుబాబు తదితరులు గుంటూరు కారంలో కీలక పాత్రలు చేసారు. ఇక ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఈ మూవీ బాగానే కలెక్షన్ రాబడుతూ ఉండడం విశేషం. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్డంతో ఈ స్థాయి కలెక్షన్స్ వస్తున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతోంది.

Guntur Kaaram Boxoffice Collection Storm

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా రూ. 212 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన గుంటూరు కారం మూవీ లేటెస్ట్ గా రూ. 240 కోట్ల గ్రాస్ ని రూ. 119 షేర్ ని సొంతం చేసుకుని దూసుసుకెళుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రమణ గాడి పాత్రలో స్టన్నింగ్ పెర్ఫార్మన్స్, త్రివిక్రమ్ మార్క్ స్టైల్ టేకింగ్, థమన్ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మహేష్ బాబు శ్రీలీల పవర్ఫుల్ డాన్స్ మొమెంట్స్, ఆకట్టుకునే కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు, ఫైట్స్, విజువల్స్ వంటివి గుంటూరు కారం మూవీకి ప్రధాన ఆకర్షణగా చెప్తున్నారు సినీ విశ్లేషకులు. మరి రాబోయే రోజుల్లో గుంటూరు కారం ఇంకెంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Guntur Kaaram Boxoffice Collection Storm

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Guntur Kaaram Boxoffice Collection Storm