Megastar Shocking Meet With CM Revanth Reddy l సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ షాకింగ్ మీట్ 2023

Written by Movie Updates

Published on:

Megastar Shocking Meet With CM Revanth Reddy:- ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2023 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ తరపున సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy). అయితే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి మొత్తంగా 20 రోజులు గడిచాయి. ఈ సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనని కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు.

ఇక చార్జి తీసుకున్న తొలిరోజు నుండి ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి. కాగా మ్యాటర్ ఏమిటంటే సోమవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆయన నివాసంలో కలిసి శుభాభినందనలు తెలియచేసారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.

Megastar Shocking Meet With CM Revanth Reddy

మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారితో తనకు మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు చిరంజీవి (Chiranjeevi). కాగా తెలంగాణ రాష్ట్ర సరికొత్త సీఎంగా ఇటీవల ఆయన ప్రమాణస్వీకారం చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచిందని, అలానే ఆయన అధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన తప్పక లభిస్తుందని చిరంజీవి అభిలషించారు.

Megastar Shocking Meet With CM Revanth Reddy

అనంతరం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా పుష్పగుచ్ఛం ఇచ్చిన చిరంజీవి శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డిని మెగాస్టార్ కలిసిన ఈ ప్రత్యేక భేటీ అటు సినీతో పాటు ఇటు రాజకీయ రంగంలో కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే వీరిద్దరి ప్రత్యేక భేటీలో ఏయే విషయాలు చర్చకు వచ్చాయనేది మాత్రం తెలియరాలేదు. కాగా వారిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు తప్ప ఎటువంటి రాజకీయ అంశాల పై చర్చ రాలేదన్నది వారి సన్నిహితులు చెప్తున్న మాట.

Megastar Shocking Meet With CM Revanth Reddy

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Megastar Shocking Meet With CM Revanth Reddy

1 thought on “Megastar Shocking Meet With CM Revanth Reddy l సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ షాకింగ్ మీట్ 2023”

Comments are closed.