Oh God! Animal Total Collection Worldwide l యానిమల్ టోటల్ కలెక్షన్ వరల్డ్ వైడ్ 2024

Written by Movie Updates

Published on:

Animal Total Collection Worldwide:- రణబీర్ కపూర్ హీరోగా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయిన పాన్ ఇండియన్ మూవీ ఆనిమల్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో త్రిప్తి దిమ్రి, అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మించాయి.

యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆనిమల్ మూవీని యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అద్భుతంగా తెరకెక్కించారు. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ అన్ని ఏరియాల్లో కూడా రికార్డులు సొంతం చేసుకుంది. ముఖ్యంగా రన్విజయ్ సింగ్ పాత్రలో రణబీర్ కపూర్ సూపర్ పెర్ఫార్మన్స్ తో పాటు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ అలానే హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటి వాటికీ ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి విశేషమైన రెస్పాన్స్ లభించింది.

Animal Total Collection Worldwide

ఇక ఈ మూవీ ఇప్పటికే వర్ల వైడ్ రూ. 890 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని రూ. 900 కోట్లని సొంతం చేసుకునే దిశగా కొనసాగుతోంది. అయితే ఇటీవల ప్రభాస్ సలార్, షారుఖ్ ఖాన్ డన్కి రిలీజ్ తో ఒక్కసారిగా ఆనిమల్ థియేటర్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఇక ఇప్పటికే ఆనిమల్ మూవీ రిలీజ్ అయి నాలుగు వారాలు గడిచినప్పటికీ కూడా అక్కడక్కడా బాగానే కలెక్షన్ లభిస్తుండడం విశేషం.

Animal Total Collection Worldwide

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 72. 50 కోట్ల గ్రాస్, రూ. 36. 70 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.
కాగా ఆనిమల్ మూవీ రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అనగా మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 21 కోట్ల లాభం లభించింది. మరోవైపు హిందీలో ఇప్పటివరకు రూ. 493. 50 కోట్ల నెట్ ని కలెక్ట్ చేసింది. మొత్తంగా గడచిన 30 రోజుల్లో ఆనిమల్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ డిటైల్డ్ గా క్రింద వివరాల్లో చూడండి.

ఆనిమల్ 30 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ : –

ఏపీ, తెలంగాణ – రూ. 72. 50 కోట్లు

తమిళనాడు – రూ. 10. 35 కోట్లు

కర్ణాటక – రూ. 36. 70 కోట్లు

కేరళ – రూ. 4. 90 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 524. 10 కోట్లు

ఓవర్సీస్ – రూ. 241. 35 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ – రూ. 889. 90 కోట్లు

Animal Total Collection Worldwide

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Animal Total Collection Worldwide