Pushpa 3 to be made with a powerful caption l పవర్ఫుల్ క్యాప్షన్ తో రూపొందనున్న పుష్ప 3

Written by Movie Updates

Published on:

Pushpa 3:- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) లేటెస్ట్ మూవీ పుష్ప పార్ట్ 2 (Pushpa 2: The Rule) అయిన పుష్ప ది రూల్ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న పుష్ప ది రూల్ మూవీ ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకున్న పుష్ప 1 ది రైజ్ (Pushpa: The Rise) కి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. ఇక పుష్ప పార్ట్ 1 మూవీ లో టైటిల్ లో రోల్ అల్లు అర్జున్ సూపర్ యాక్టింగ్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తెలుగుతో పాటు పాన్ ఇండియన్ మూవీ గా పలు ఇతర భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ సొంతం చేసుకుంది.

Pushpa 3 release date

ఇక ఈ మూవీలో అద్భుత నటన ప్రదర్శనకు గాను అల్లు అర్జున్ కు ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించడం విశేషం. ఇక పుష్ప 2 మూవీ విషయానికి వస్తే దీనిని పార్ట్ 1 ని మించేలా దర్శకుడు సుకుమార్ మరింత అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, ఫహాద్ ఫాసిల్, అనసూయ, జగపతి బాబు, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు.

Pushpa 3 the roar

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న పుష్ప 2 మూవీ 2024 ఆగష్టు 15న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ కూడా తప్పకుండా ఆడియన్స్ అంచనాలు అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏమిటంటే, దీనికి సీక్వెల్ గా పుష్ప 3 మూవీ కూడా రూపొందనుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Pushpa 3 name

కాగా ఆ మూవీ ‘ది రోర్’ అనే పవర్ఫుల్ క్యాప్షన్ తో రూపొందనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అలానే పార్ట్ 2 ని మించేలా పార్ట్ 3 ని మరింత పవర్ఫుల్ గా గ్రాండియర్ రేంజ్ లో మేకర్స్ తెరకెక్కించనున్నారట. ఇక పార్ట్ 2 క్లైమాక్స్ అదిరిపోవడంతో దానికి లింక్ అవుతూ పుష్ప 3 ఉంటుందని అంటున్నారు.

Pushpa 3 trailer

ఇక పుష్ప 3 లో అల్లు అర్జున్ పాత్రతో పాటు ఇతర మరికొన్ని పాత్రలు కూడా అదిరిపోయేలా దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట. ఇక పక్కాగా పుష్ప 3 ఎప్పుడు పట్టాలెక్కుతోంది, ఎప్పుడు అనౌన్స్ మెంట్ వస్తుంది అనే దానిపై మాత్రం మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తుంటే పుష్ప మూవీస్ ని ఒక ఫ్రాంచైజ్ గా మేకర్స్ తీయాలని ఆలోచనా చేస్తున్నారని అంటున్నాయి సినీ వర్గాలు.

Pushpa 3

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2 thoughts on “Pushpa 3 to be made with a powerful caption l పవర్ఫుల్ క్యాప్షన్ తో రూపొందనున్న పుష్ప 3”

  1. My brother suggested I would possibly like this web site.
    He was once entirely right. This publish actually
    made my day. You can not consider simply how much time I had spent for this information! Thank you!

Comments are closed.