Animal Park Movie Release Date:- ఇటీవల 2023 డిసెంబర్ లో రిలీజ్ అయిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆనిమల్ (Animal) అందరి అంచనాలు అందుకుని అన్ని భాషల్లో కూడా భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సినీ ఒన్ స్టూడియోస్, టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఆనిమల్ మూవీలో రణబీర్ సింగ్ రెండు పాత్రల్లో కనిపించారు. అందులో ఒకటి రన్విజయ్ సింగ్ కాగా మరొకటి అజిజ్ హక్. కాగా ఈ రెండు పాత్రల్లో ఆయన అద్భుతంగా నటించారు. అయితే అందులో రన్విజయ్ సింగ్ పాత్ర ఆనిమల్ సినిమా మొత్తం ఉండగా అజీజ్ పాత్ర మూవీ యొక్క క్లైమాక్స్ లో వస్తుంది.
Animal Park Movie Release
కాగా ఈ మూవీకి సీక్వెల్ అయిన ఆనిమల్ పార్క్ మూవీలో అజీజ్ ది కీలక పాత్ర అని తెలుస్తోంది. ముఖ్యంగా ఆనిమల్ మూవీ విషయానికి వస్తే, చిన్నప్పటి నుండి తన తండ్రిని అమితంగా ఇష్టపడి ప్రేమించే ఒక కొడుకు, అనంతరం ఆయన పై ఒక తుపాకీ దాడి జరగడంతో ఆ పని చేసిన దుండగుల పై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు, మరి ఇంతకీ ఆ దుండగులు ఎవరు ఏమిటి, అలానే రన్విజయ్ సింగ్ యొక్క లైఫ్ ఏ విధంగా సాగింది అనేటువంటి కథాంశంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆనిమల్ మూవీని తెరకెక్కించారు.
ఈ మూవీలో రన్విజయ్ సింగ్ గా రణబీర్ కపూర్ అద్భుతంగా నటించారు. ఆయన తండ్రిగా అనిల్ కపూర్, అలానే భార్య గీతాంజలి గా రష్మిక మందన్న కూడా ఆకట్టుకున్నారు. మొత్తంగా రూ. 125 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 930 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని తిరుగులేని సక్సెస్ అందుకుంది.
Animal Park Movie Release Date Fixed
ఇక ముఖ్యంగా టాపిక్ లోకి వెళితే, మూవీ యొక్క క్లైమాక్స్ లో చూపించిన అజీజ్ హక్ పాత్ర ఎంతో వయొలెంట్ గా ఉంటుందని మనకు ఆ పాత్ర యొక్క క్రూరత్వాన్ని బట్టి తెలుస్తోంది. అలానే ఆనిమల్ ని మించేలా ఆనిమల్ పార్క్ మూవీ మరింత వయొలెంట్ గా ఉండే అవకాశం లేకపోలేదని ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో భాగంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హింట్స్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ కోసం స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ చేస్తోన్న సందీప్ రెడ్డి, దాని అనంతరం ఆనిమల్ పార్క్ మూవీ తీయనున్నట్లు తెలుస్తోంది.
Animal Park Movie
ముందుగా ఈ ఏడాది సెప్టెంబర్ లో స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుందా దానిని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేయనున్నారట. అలానే దీనిని బట్టి ఆనిమల్ పార్క్ మూవీ వచ్చే ఏడాది చివర్లో ప్రారంభం అయి 2026 మధ్యలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు. మొత్తంగా అయితే ఆనిమల్ పార్క్ మూవీ పై ఇప్పటినుండే రణబీర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పడ్దయని చెప్పాలి.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
I almost never drop comments, however i did a few searching and wound up here Animal Park Movie Release Date
Fixed l ఆనిమల్ పార్క్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్డ్ 2025
– Movie Updates. And I actually do have 2 questions for
you if you usually do not mind. Is it only me or does it appear like some of the remarks come across as if they
are coming from brain dead individuals? 😛 And, if you are writing on other sites, I would like to
follow everything new you have to post. Could you make a list of all of all your shared sites like your linkedin profile, Facebook page or
twitter feed?
my blog; honest Psychic readings