Keerthy Suresh Movies Age Family Secrets 2024 l కీర్తి సురేష్ మూవీస్ వయసు ఫ్యామిలీ సీక్రెట్స్

Written by Movie Updates

Updated on:

Keerthy Suresh Movies తెలుగు చలన చిత్ర సీమకి తొలిసారిగా హీరోయిన్ గా నేను శైలజ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు అందాల కథానాయిక కీర్తి సురేష్. యువ నటుడు రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 2015 లో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ లవ్, యాక్షన్, ఫామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో శైలజ పాత్రలో నటించిన కీర్తి సురేష్ తన ఆకట్టుకునే అందం అభినయం తో ఆడియన్స్ ని ఎంతో అలరించారు.

నిజానికి అంతకముందు 2013 లో మలయాళంలో రూపొందిన గీతాంజలి అనే మూవీ ద్వారా తొలిసారిగా నటిగా చిత్ర సీమకి ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేష్. ఆపైన 2015 లో ఏడూ ఎన్న మయం అనే మూవీ ద్వారా తమిళ చిత్రసీమకు ఆమె ఎంట్రీ ఇవ్వడం జరిగింది. రాధికా శరత్ కుమార్ నిర్మించిన ఈ మూవీలో విక్రమ్ ప్రభు హీరో గా నటించారు. ఇక తెలుగు లో నేను శైలజ మూవీ ద్వారా విజయం అందుకున్న కీర్తి సురేష్ ఆపైన నాచురల్ స్టార్ నాని హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన నేను లోకల్ మూవీలో హీరోయిన్ గా నటించారు. 2017 లో మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ విజయం అందుకుంది.

keerthy suresh saree

దానితో మరింత మంచి క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ ఆపైన ఏకంగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి మూవీలో ఒక హీరోయిన్ గా అవకాశం సొంతం చేసుకున్నారు కీర్తి. మరొక యువ నటి అను ఇమ్మానుయేల్ కూడా ఒక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అప్పట్లో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిసాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత తమిళ్ లో సూర్య హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ మూవీలో హీరోయిన్ గా నటించారు. అయితే అది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు, అనంతరం టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఒకప్పటి మహానటి సావిత్రి జీవిత గాథ ఆధారంగా రూపొందిన మహానటి మూవీ లో టైటిల్ రోల్ పోషించారు కీర్తి సురేష్.

యువ దర్శకుడు నాగ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించిన ఈ మూవీలో సావిత్రి గారి పాత్రలో తన సహజ నటనతో అభిమానులు, ప్రేక్షకుల నుండి అలానే విమర్శకుల నుండి సైతం విశేషమైన పేరు సొంతం చేసుకున్నారు కీర్తి సురేష్. 2018 మే లో రిలీజ్ అయిన మహానటి మూవీ అందరి అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రూ. 25 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన మహానటి మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 83 కోట్లు రాబట్టటం విశేషం. మరొక కీలక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మూవీలో మహానటిగా అద్భుత నటన కనబర్చిన కీర్తి సురేష్ కు జాతీయ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు లభించింది.

keerthy suresh saree photo

ఇక అక్కడి నుంచి ఆమెకు తెలుగు తోపాటు అటు తమిళ్ లో కూడా వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఆపైన తమిళ నటులైన శివకార్తికేయన్ తో సీమ రాజా, రెమో, చియాన్ విక్రమ్ తో స్వామి స్క్వేర్, విశాల్ తో పందెం కోడి 2, ఇలయదళపతే విజయ్ తో సర్కార్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి పలు విజయాలు తన ఖతాలో వేసుకున్న కీర్తి సురేష్. అలానే పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లాక్ సఖి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు కీర్తి కీర్తి సురేష్. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన అన్నాత్తే మూవీలో రజిని సోదరి పాత్రలో నటించి మెప్పించారు కీర్తి సురేష్.

అలానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన మరక్కార్ మూవీ లో కూడా నటించి మెప్పించారు కీర్తి. ఇక ఇటీవల తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటించి మరొక విజయం అందుకున్నారు. ఆపైన నాచురల్ స్టార్ నాని హీరో గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ మాస్ ఎంటర్టైనర్ దసరా లో వెన్నెల పాత్రలో నటించి ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు కీర్తి సురేష్.

keerthy suresh Age

అలానే తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ నటించి, నిర్మించిన మా మన్నన్ లో కూడా హీరోయిన్ గా నటించి అలరించారు. ఫాహద్ ఫాసిల్, వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని మరి సెల్వరాజ్ తెరకెక్కించారు. అలానే ఇటీవల మెహర్ రమేష్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ మూవీ లో చిరంజీవికి సోదరిగా నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు కీర్తి సురేష్. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా వైజయంతి మూవీ సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి మూవీలో బుజ్జి అనే కారుకి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు కీర్తి.

అలానే అటు తమిళ్ లో రఘు తాత, రివాల్వర్ రీటా, కన్ని వేడి సినిమాలతో పాటు అటు హిందీ లో వరుణ్ ధావన్ హీరో గా రూపొందుతున్న యాక్క్షన్ ఎంటర్టైనర్ బేబీ జాన్ లో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. మొత్తంగా ఆమె నటిస్తున్న ఈ సినిమాలపై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలున్నాయి. ఆ విధంగా నటిగా ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ ని విశేషమైన ఆదరణని అందుకుంటూ కొనసాగుతున్న కీర్తి సురేష్ రాబోయే రోజుల్లో నటిగా మరిన్ని భారీ విజయాలు సొంతం చేసుకుని కెరీర్ పరంగా దూసుకెళ్లాలని కోరుకుందాం.

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

keerthy suresh movies