Samantha Age తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం అత్యద్భుతమైన క్రేజ్ తో ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణతో కొనసాగుతున్న కథనాయికల్లో సమంత రూత్ ప్రభు కూడా ఒకరు. తొలిసారిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో యువ నటుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల ఘట్టమనేని గ్రాండ్ లెవెల్లో నిర్మించిన లవ్, యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఏం మాయ చేసావే ద్వారా తెలుగు చిత్ర సీమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు సమంత రూత్ ప్రభు. అంతకముందు తన కాలేజీ డేస్ లో అక్కడక్కడా పలు షోస్ లో, ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసిన సమంత ఆపైన మలయాళ స్థానిక కేబుల్ చానల్స్ లో పలు యాడ్స్ లో నటించి ఆకట్టుకున్నారు.
అయితే ఆ యాడ్స్ లో సమంతని చూసిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఆ తరువాత ఆమెను ముంబైకి పిలిపించి ఏం మాయ చేసావే మూవీ కోసం ఆడిషన్ నిర్వహించి హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. ఆ విధంగా ఫస్ట్ మూవీతో తెలుగు చిత్ర సీమకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఏం మాయ చేసావే మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో జెస్సి పాత్రలో కనిపించిన సమంత రూత్ ప్రభు తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఎందరో ఆడియన్స్ ని అలరించి ఆకట్టుకున్నారు.
samantha husband
ఆ మూవీలో హీరోగా నాగ చైతన్య అలరించే నటన, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆకట్టుకునే టేకింగ్, ఏ ఆర్ రెహ్మాన్ అద్భుతమైన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఏం మాయ చేసావే మూవీ భారీ సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించాయి. ఇక అక్కడినుంచి తెలుగులో సమంత కి ఒక్కొక్కటిగా అవకాశాలు రాసాగాయి. ఆపైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కాజల్ అగర్వాల్ మరొక హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన బృందావనం మూవీలో ఒక హీరోయిన్ గా నటించి అందరిని అలరించారు సమంత రూత్ ప్రభు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయం అందుకొని హీరోయిన్ గా సమంతకు బాగా పేరు తెచ్చిపెట్టింది.
ఆపైన ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన దూకుడు మూవీలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు సమంత. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా కీలక పాత్రలలో ప్రకాష్ రాజ్, సోను సూద్, తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్ వంటి వారు నటించారు. 2011 లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన దూకుడు మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనమైన విజయం నమోదుచేసుకుంది. ఆ తరువాత దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా కిచ్చ సుదీప్, నోయెల్, ఛత్రపతి శేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈగలో హీరోయిన్ గా నటించారు సమంత. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజయం అందుకుంది.
samantha photos
మొత్తంగా బృందావనం, దూకుడు, ఈగ సినిమాల భారీ సక్సెస్ లు హీరోయిన్ గా సమంతకు టాలీవుడ్ లో ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఇక అక్కడి నుంచి మరిన్ని భారీ అవకాశాలతో స్టార్ నటుల సరసన నటించి పలు విజయాలు తన ఖాతాలో వేసుకొని గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా గొప్ప క్రేజ్ అందుకున్నారు. ఆపైన పలువురు కోలీవుడ్ స్టార్ నటుల సినిమాల్లో సైతం అవకాశాలు అందుకున్న సమంత అక్కడ కూడా సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల తన తొలి చిత్ర కధానాయకుడు అక్కినేని మూడోతరం నటుడు నాగ చైతన్య ని ప్రేమించి వివాహం చేసుకున్నారు సమంత. అయితే నాలుగేళ్ళ వివాహబంధం అనంతరం కొన్ని అనివార్య కారణాల వాళ్ళ వారిద్దరూ ఒకరినుండి మరొకరు విడిపోయారు.
samantha naga chaitanya
కాగా కొన్నాళ్ల క్రితం మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంత ఆపైన డాక్టర్స్ నుంచి మెరుగైన చికిత్స తీసుకొని ప్రస్తుతం మెల్లగా కోలుకున్నారు. ఇక ఇటీవల విదేశాల్లో పలు ప్రాంతాలకు వెకేషన్ వెళ్లొచ్చిన సమంత మానసికంగా కూడా ఎంతో దృఢంగా సిద్ధమయ్యారు. ఇక ఇటీవల ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీ శాకుంతలం. మలయాళ నటుడు దేవ్ పటేల్ దుశ్యంతుడిగా, సమంత శకుంతలగా ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందిన ఈ మూవీ రిలీజ్ అనంతరం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
samantha prabhu
అనంతరం పాన్ ఇండియన్ మూవీ యశోద ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు సమంత. ఇక ప్రస్తుతం దర్శక ద్వయం రాజ్ డీకే దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ వరుణ్ ధావన్ హీరోగా అమెరికన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియన్ రీమేక్ గా రూపొందుతున్న సిటాడెల్ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు సమంత రూత్ ప్రభు. చిత్రీకరణ ఆల్మోస్ట్ చివరిదశకు చేరుకున్న సిటాడెల్ సిరీస్ అతి త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఆడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు కొన్నాళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఫామిలీ మ్యాన్ 2 సిరీస్ లో రాజి పాత్రలో నటించి తన సహజ నటనతో అందరిని మెప్పించారు సమంత రూత్ ప్రభు.
samantha images
ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఇల్లు కొనుగోలు చేసి జీవనం కొనసాగిస్తున్నారు సమంత. జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో అలాగే దృఢ నిశ్చయంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని సమంత చెప్తుంటారు. ఆలాగే తన వ్యక్తిగత జీవితం పరంగా కెరీర్ పరంగా కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులు, ముఖ్యంగా అభిమానులు తన వెన్నంటే ఉండి వెన్నుతట్టి అందించిన ప్రోత్సహం, తోడ్పాటు ఎప్పటికి మరువలేనని చెప్తారు సమంత. మరి నటిగా సమంత రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలతో కొనసాగాలని కోరుకుందాం.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి