Anushka Shetty Shocking Decision
తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ తో కొనసాగుతున్న వారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు. బెంగళూరుకు చెందిన అనుష్క తొలిసారిగా నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ మూవీ ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఆ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో బాలీవుడ్ నటి అయేషా టాకియా హీరోయిన్ గా నటించారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ విజయం అందుకుంది. మరొక నటుడు సోను సూద్ ప్రధాన పాత్ర చేసిన సూపర్ మూవీలో షాషా పాత్రలో నటించి ఫస్ట్ మూవీ తోనే తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించారు స్వీటీ అనుష్క శెట్టి.
అనంతరం శ్రీహరి ప్రధాన పాత్రలో సుమంత్ హీరోగా తెరకెక్కిన మహానంది మూవీలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం లభించింది. ఆ మూవీ మంచి విజయం అందుకుని అనుష్క శెట్టి కి బాగా పేరు తీసుకువచ్చింది. అలానే ఆపైన విష్ణు మంచు హీరోగా రూపొందిన అస్త్రం, మాస్ మహారాజ రవితేజ తో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా అవకాశాలు అనుష్క కు లభించాయి. ఆ మూవీస్ రెండిటిలో విక్రమార్కుడు భారీ విజయం ఆమెకు హీరోయిన్ గా ఇంకా పేరు తీసుకువచ్చింది.
Anushka Shetty Shocking Decision
ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్టాలిన్ మూవీలో అప్పట్లో ఒక స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకున్నారు అనుష్క శెట్టి. అలానే యాక్షన్ హీరో గోపీచంద్ తో లక్ష్యం, మరొక్కసారి కింగ్ అక్కినేని నాగార్జున తో డాన్, నటసింహం నందమూరి బాలకృష్ణతో ఒక్క మగాడు మూవీస్ చేసారు. అయితే వీటిలో డాన్, ఒక్క మగాడు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.
అయితే లక్ష్యం మాత్రం పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక అదే సమయంలో విక్టరీ వెంకటేష్ తో అనుష్క శెట్టి చేసిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చింతకాయల రవి. ఈ మూవీ కూడా అప్పట్లో మంచి విజయం అందుకుంది. ఆ తరువాత ఆమెకు దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ అరుంధతి మూవీలో అవకాశం ఇవ్వడం, రిలీజ్ అనంతరం అప్పట్లో ఆ మూవీ పెద్ద విజయం అందుకోవడంతో హీరోయిన్ గా అనుష్క పెద్ద స్టార్ అయ్యారు.
ఇక ఇటీవల ప్రభాస్ హీరోగా రాజమౌళి తీసిన బాహుబలి రెండు సినిమాల భారీ విజయాలతో దూసుకెళ్లిన అనుష్క శెట్టి ప్రస్తుతం ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. వాస్తవ ఘటనల ఆధారంగా ఘాటీ తెరకెక్కుతోందని, తనకు జరిగిన అన్యాయానికి ఒక అమాయక మహిళా ఏ విధంగా రివెంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఇంట్రెస్టింగ్ కథ కథనాలతో ఈ మూవీ రూపొందుతోన్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మాట్లాడుతూ చెప్పారు.
Anushka Shetty Shocking Decision
ఇక ఇటీవల యువ నటుడు నవీన్ పోలిశెట్టి తో కలిసి అనుష్క శెట్టి చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ పెద్ద విజయం అందుకుంది. యువ దర్శకుడు పి మహేష్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీకి రాధన్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలుఎ ఏర్పరిచిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో అనుష్క తన ఖాతాలో మరొక సక్సెస్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీని కూడా యువి క్రియేషన్స్ వారు నిర్మించడం విశేషం.
దానితో ఇకపై కెరీర్ పరంగా మరింతగా సినిమాలు చేయడానికి సిద్ధం అయ్యారు అనుష్క. అలానే ఘాటీ తో పాటు కథనార్ అనే మలయాళ మూవీ కూడా చేస్తున్నారు. నిజానికి కొన్ని కారణాల వలన ఆమె ఎంతో సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు. అయితే ఇకపై పక్కాగా ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు వరుసగా సినిమాలు సెలెక్ట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారట.
మొత్తంగా అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. గతంలో అరుంధతి మాదిరిగా అటువంటి పవర్ఫుల్ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ కనుక తన వద్దకు వస్తే చేసేందుకు అనుష్క సిద్ధం అంటున్నారు. ఆ మూవీ తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం అని, అలానే దర్శకుడు కోడి రామకృష్ణ గారి నుండి అనేక గొప్ప విషయాలు నేర్చుకున్నానని పలు సందర్భాల్లో అనుష్క శెట్టి చెప్తూ ఉంటారు. మరోవైపు తనవంతుగా పలు సామజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ కొనసాగుతున్నారు అనుష్క శెట్టి.
ఎక్కువగా ఆమె తన సేవా గుణాన్ని బయటకి చెప్పుకోరని, ఎంతో గొప్ప వ్యక్తిత్వం మనసు గల వ్యక్తి ఆమె అని పలువురు ఆమె సన్నిహితులు చెప్తూ ఉంటారు. తన కెరీర్ లో పలు రొమాంటిక్, గ్లామర్ పాత్రలు చేసానని, అందుకే ఇకపై మరింత జాగ్రత్తగా సినిమాల ఎంపిక చేసుకుంటున్నానని అంటున్నారు అనుష్క. ముఖ్యంగా మొదటి నుండి ఆడియన్స్ తో పాటు పలువురు ఫ్యాన్స్ తనకు అందిస్తున్న తోడ్పాటు ఎప్పటికీ మరువలేనని, తప్పకుండా ఇకపై వారిని అలరించే మంచి చిత్రాల్లో నటించి ముందుకు సాగుతానని అంటున్నారు.
ప్రధానంగా తనకు బాగా నచ్చిన కథలను మాత్రమే ప్రస్తుతం ఎంపిక చేసుకుంటున్నానని, ఆ విధంగా ఎంచుకున్న ఘాటీ మూవీ కథ కూడా అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అనుష్క శెట్టి. మొత్తంగా అయితే తన ఫ్యాన్స్ కి అనుష్క మంచి చిత్రాలను అందించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మరి నటిగా అనుష్క శెట్టి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.
Anushka Shetty Shocking Decision
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి