Laapataa Ladies Beats Animal Record l ఆనిమల్ రికార్డు బద్దలు కొట్టిన లాపతా లేడీస్ 2024

Written by Movie Updates

Published on:

Laapataa Ladies Beats Animal Record భారతీయ సినిమా పరిశ్రమ ఇటీవలతో పోలిస్తే అన్ని భాషల్లో కూడా మంచి సినిమాలతో ఆడియన్స్ యొక్క మెప్పుతో సక్సెస్ లతో కొనసాగుతోంది. పాన్ ఇండియన్ సినిమాల రాక తరువాత బాలీవుడ్ కి ధీటుగా అటు సౌత్ సినీ పరిశ్రమ కూడా దూసుకెళ్తోంది. కొన్నేళ్ల క్రితం ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు, అలానే ఇటీవల ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి నే తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్, అలానే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన కెజిఎఫ్ సిరీస్ సినిమాలు, మరొక కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి నటిస్తూ తెరకెక్కించిన కాంతారా వంటి సినిమాలు బాలీవుడ్ లో సంచలన స్థాయి కలెక్షన్ అందుకున్నాయి.

అలానే ఇటు బాలీవుడ్ లో సైతం పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ విజయఢంకా మ్రోగిస్తూ కొనసాగుతున్నాయి. ఇటీవల రణబీర్ కపూర్ హీరోగా యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఆనిమల్ మూవీ భారీ విజయం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రూ. 930 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో రన్విజయ్ సింగ్ గా, అజీజ్ హక్ గా రణబీర్ కపూర్ తన సూపర్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ పై పలు విమర్శలు సైతము వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తన తండ్రి పై దాడి చేసి ఆయనని మట్టుబెట్టాలని చూసిన వారిపై ఒక కొడుకు ఏ విధంగా పగ తీర్చుకున్నాడు అనే కాన్సెప్ట్ తో ఆనిమల్ మూవీ రూపొందింది.

How are Laapataa Ladies?

ఇక ఈ మూవీలో పృథ్వీరాజ్, అనిల్ కపూర్, శక్తి కపూర్ వంటి వారు కీలక పాత్రలు పోషించగా హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ముఖ్యంగా ఆనిమల్ మూవీలో స్టోరీ, టేకింగ్ తో పాటు డైలాగ్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ విజువల్స్, ఆర్టిస్టుల యాక్టింగ్ వంటివి ప్రధాన బలాలు గా నిలిచి మూవీకి పెద్ద సక్సెస్ ని అందించాయి. ఇక ఈ మూవీ థియేటర్స్ లో అదరగొట్టడంతో పాటు ఇటీవల ప్రముఖ ఓటిటి మధ్యమం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయి భారీ రెస్పాన్స్ ని సొంతం చేసుకొవడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక మరోవైపు తాజాగా బాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చి అటు థియేటర్స్ లో సందడి చేసి, ఇటు ప్రస్తుతం ఓటిటి లో కూడా అదరగొడుతున్న మూవీ లాపతా లేడీస్.

రూ. 4 కోట్లతో మాత్రమే నిర్మితం అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద థియేటర్స్ లో ఆడియన్స్ ని అలరించి రూ. 20 కోట్ల కలెక్షన్ రాబట్టింది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయల్, ప్రతిభ రంత, రవి కిషన్, ఛాయా కదం, దుర్గేష్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే గ్రాండ్ లెవెల్లో నిర్మించగా కిరణ్ రావు స్వయంగా తెరకెక్కించారు. కథ పరంగా చెప్పాలంటే, 2001 నిర్మల్ ప్రదేశ్ లో ఫూల్ కుమారితో దీపక్ కి తన పెద్దలు వివాహం నిశ్చయిస్తారు. అన్ని కుదిరిన అనంతరం అమ్మాయి ఇంటి వద్ద వీరిద్దరి వివాహం వైభవంగా బంధువుల సమక్షంలో జరుగుతుంది. అయితే వివాహానంతరం భార్య ఫూల్ కుమారితో కలిసి రైలు ఎక్కి ఇంటికి బయల్దేరతాడు దీపక్.

Is Laapataa Ladies a real story?

వారితో పాటు మరొక రెండు కొత్త పెళ్లి జంటలు కూడా రైలు ఎక్కుతారు. అయితే అక్కడి ఆచారం ప్రకారం కొత్త పెళ్లి కూతుళ్లు అందరూ కూడా ఒకటే రకమైన వస్త్రధారణ కలిగి ఉండడంతో పాటు ముఖం కనిపించకుండా ముసుగు వేసుకుని ఉండడం అక్కడి ప్రాంత ఆచారం. అయితే ప్రయాణం అనంతరం తమ గమ్య స్థానం రావడంతో రైలు దిగిన దీపక్, తన భార్య చేయి పట్టుకుని చీకటిలో రైలు దిగి ఇంటికి చేరుకుంటాడు. అనంతరం ఇంట్లో నూతన వధూవరులకు హారతివ్వడానికి ఆమె ముసుగు తీయడంతో ఒక్కసారిగా షాక్ కి గురవుతారు.

కారణం ఏంటంటే, దీపక్ తో వచ్చింది ఫూల్ కుమారి కాదు, ఆమె పేరు పుష్ప రాణి అని తెలుస్తుంది. రైలులో పెళ్లి కూతుళ్లు అందరికీ ఒకటే రకమైన ముసుగు కలిగి ఉండడంతో అనుకోకుండా ఫూల్ కుమారి బదులు పుష్ప రాణిని తీసుకొచ్చినట్లు తెలుసుకుంటాడు దీపక్. మరి ఆ తరువాత ఏమైంది, అసలు ఫూల్ కుమారి ఏమైంది, ఇంతకీ పుష్ప రాణి అసలు ఎవరు, ఆ తరువాత ఏమి జరిగింది, మరి ఇంతకీ ఆ జంటలు చివరికి ఎటువంటి గంటలకు చేరాయి అనే కథాంశంతో లాపతా లేడీస్ మూవీ సాగుతుంది.

Where can you watch Laapataa Ladies?

స్త్రీ సాధికారత అనే అంశాన్ని స్పృశిస్తూ చక్కని మెసేజ్ ని కూడా అందించారు దర్శకురాలు కిరణ్ రావు. ముఖ్యంగా ఈ సినిమాలోని పలు సన్నివేశాలు కామెడీ ని పండించడంతో పాటు అందరి హృదయాలను తాకుతాయి. ఇక లాపతా లేడీస్ మూవీకి ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో భారీ వ్యూస్ వస్తుండడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీ ఆనిమల్ ఆల్ టైం వ్యూస్ ని దాటేసి అత్యద్భుత రికార్డు సొంతం చేసుకుంది.

Laapataa లేడీస్ నిజమైన కథ ఉంది?

ఆనిమల్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మొత్తంగా 13. 6 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోగా లాపతా లేడీస్ మూవీ కేవలం నెల రోజుల్లోనే దానిని అధిగమించి ఇటీవల 13.8 మిలియన్ వ్యూస్ ని దాటేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువత నుండి కూడా లాపత లేడీస్ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. కేవలం తక్కువపతి ఖర్చుతో చక్కని సినిమాని ఈ మూవీ మేకర్స్ అందించడంతో పాటు ఆకట్టుకునే కథ, కథనాలు, టేకింగ్, ఆర్టిస్టుల యాక్టింగ్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సీన్స్ వంటివి ఈ మూవీకి ప్రధాన బలంగా చెప్పుకోవాలి. మరి రాబోయే రోజుల్లో లాపతా లేడీస్ మూవీ ఇంకెంత మేర రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Laapataa Ladies Beats Animal Record