Mahesh Babu Shocking Post on his Son Gautham టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అంతకముందు అప్పటికే కెరీర్ పరంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు, అలానే పరశురామ్ పెట్ల తెరకెక్కించిన సర్కారు వారి పాట మూవీస్ ద్వారా వరుసగా నాలుగు విజయాలు అందుకున్నారు. ఇక గుంటూరు కారం మూవీ కూడా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి విజయం సొంతం చేసుకుని ఆయనకు కెరీర్ పరంగా ఐదవ విజయాన్ని అందించింది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా ఎస్ థమన్ సంగీతం అందించారు.
రమ్యకృష్ణ ఈ మూవీలో మహేష్ బాబు తల్లి పాత్రలో కనిపించగా మలయాళ నటుడు జయరాం ఆయనకు తండ్రి పాత్రలో కనిపించారు. మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన గుంటూరు కారం మూవీని టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థల్లో ఒకటైన హారికా హాసిని క్రియేషన్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా మనోజ్ పరమహంస ఫొటోగ్రఫి అందించారు. రిలీజ్ అనంతరం విజయం సొంతం చేసుకున్న ఈ మూవీ సాంగ్స్ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులోని కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.
Mahesh Babu Wikipedia
ఇక ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న SSMB29 మూవీ కోసం పూర్తిగా క్రాఫ్ గడ్డంతో పాటు బాడీ కూడా పూర్తిగా పెంచుతూ లేటెస్ట్ లుక్ లో స్టైలిష్ గా సిద్ధమవుతున్నారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందించనుండగా ప్రముఖ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎల్ నారాయణ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. త్వరలో ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక మొదటి నుండి అటు సినిమాలతో పాటు తన లైఫ్ ని ఎక్కుగా ఫ్యామిలీ తో గడిపేందుకు ఇష్టపడుతుంటారు మహేష్ బాబు. ఇక ఎప్పుడైనా తన షూటింగ్స్ మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ వచ్చినప్పుడు ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి విదేశాలకు వెళ్తుంటారు.
ముఖ్యంగా భార్య నమ్రత శిరోద్కర్, కూతురు సితార ఘట్టమనేని, కుమారుడు గౌతమ్ కృష్ణ లకు సంబందించిన పలు విషయాలు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తుంటారు మహేష్ బాబు. అలానే ఇటీవల విదేశాలకు ఫ్యామిలీ తో కలిసి వెళ్లిన మహేష్ వారితో కలిసి సరదాగా హాలిడే గడిపి వచ్చారు. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, నేడు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక సంచలన పోస్ట్ చేసారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్ డిగ్రీ సొంతం చేసుకున్న సందర్భంగా అతడికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేస్తూ ఫ్యామిలీ తో కలిసి దిగిన పిక్ ని పోస్ట్ చేసారు.
Mahesh Babu Instagram
నువ్వు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నందుకు తండ్రిగా ఎంతో సంతోషంగా ఉంది, అలా నీ తదుపరి చాప్టర్ కోసం సిద్దమవు, తప్పకుండా నువ్వు జీవితంలో ఎంతో పైకి ఎదిగి మరింత అభివృద్ధి సాదిస్తావు, అలానే నీ కళలను సాకారం చేసుకునేందుకు మరింత కృషి చేయి, తప్పకుండా మా అందరి ప్రేమానురాగాలు నీ పై ఎల్లపుడూ ఉంటాయి గౌతమ్ కృష్ణ అంటూ మహేష్ పెట్టిన పోస్ట్ ప్రసుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఈ పిక్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ గా గడ్డం, క్రాఫ్ తో మరింత గ్రాండియర్ స్టైలిష్ లుక్ లో అదిరిపోయారు. ఆ లుక్ లో మహేష్ ని చూసిన పలువురు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఆ పిక్ ని మరింతగా షేర్ చేస్తున్నారు.
ఇక త్వరలో మహేష్ బాబు నటించనున్న SSMB 29 మూవీ కూడా పట్టాలెక్కనుండడంతో అది కూడ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొతం చేసుకుని కెరీర్ పరంగా ఆయన డబుల్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకోవాలని కోరుతూ ముందస్తుగా అభినందనలు తెలియచేస్తున్నారు. మరోవైపు సూపర్ స్టార్ సతీమణి అయిన నమ్రత శిరోద్కర్ కూడా తనయుడు గౌతమ్ కృష్ణ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టా పై ఆనందం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా గౌతమ్ ని ఈ స్థాయిలో చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, తప్పకుండా అతడు రాబోయే రోజుల్లో మరింత ఉన్నతంగా ఎదుగుతాడని, అందుకు కావలసిన విధంగా తమ కుటుంబ తోడ్పాటు అతడికి ఎప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు.
Mahesh Babu Twitter
అలానే మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల ముద్దుల తనయ, గౌతమ్ సోదరి అయిన సితార ఘట్టమనేని కూడా తన అన్నయ్యకి గ్రాడ్యుయేషన్ పట్టా దక్కడం పై ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. మొదటి నుండి అన్నయ్య తనతో ఎంతో చక్కగా వ్యవహరిస్తాడని, ఇద్దరం కలిసి చిన్నప్పటి నుండి ఎంతో అల్లరి చేసే వాళ్ళం అని, అయితే చదువుల్లో తాను ఎప్పుడూ ముందుండి మంచి మార్కులు అందుకునే వాడని అన్నారు. ఇక ప్రస్తుతం అన్నయ్య గౌతమ్ కృష్ణ ఈ పట్టా అందుకోవడం అమ్మ, నాన్నతో పాటు తనకు కూడా ఎంతో సంతోషాన్నిస్తోందని అలానే తను రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుతూ బెస్ట్ విషెస్ తెలియచేసారు. ఇక మొత్తంగా చెప్పాలి అంటే నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఫొటోలు మరియు గౌతమ్ కృష్ణ గ్రాడ్యుయేషన్ తాలూకు పట్టా అందుకున్న న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాలతో పాటు పలు మీడియా సైట్స్, ఛానల్స్ లో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి