Dunki Review Telugu:- బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన పఠాన్, జవాన్ సినిమాలు రెండూ కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని ఒకదానిని మించేలా మరొకటి బాక్సాఫీస్ వద్ద విజయాలు సొంతం చేసుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ సొంతం చేసుకుని హీరోగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కి కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ ని అందించాయి. ఇక వాటి అనంతరం ప్రస్తుతం సీనియర్ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన సినిమా డన్కి (Dunki). ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఐదేళ్ల తరువాత రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) తెరకెక్కించిన క్రేజీ కాంబినేషన్ మూవీ డన్కి, నేడు అనగా డిసెంబర్ 21న ఈ మూవీ గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
పంజాబ్ లోని లాల్తూ ప్రాంతానికి చెందిన మను (Taapsee Pannu), సుఖీ (Vicky Kaushal), బాలి (Anil Grover), బగ్గు లగన్ పాల్ (Vikram Kochhar) పలు కారణాల రీత్యా లండన్ వెళ్లాలని అనుకుంటారు. అయితే అందుకోసం ఇంగ్లీష్ పై పట్టు బాగా పట్టుకావాలి కాబట్టి, IELTS క్లియర్ చేయాలని భావిస్తారు. అందుకోసం ఒక కోచింగ్ సెంటర్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలనుకుంటారు. హార్డీ (Shah Rukh Khan) ఒక సైనికుడు. సరిహద్దులు దాటే చట్టవిరుద్ధమైన డన్కి పద్ధతి (డాంకీ ఫ్లైట్ మెథడ్) ద్వారా తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే వారికి సహాయం చేస్తుంటాడు. అయితే ఆ నలుగురి లండన్ వెళ్లాలనే గమనంలో ఈ హార్డీ వారికి ఎలా పరిచయం అయ్యాడు, అతడు వారికి ఏవిధంగా సహాయం చేసాడు, చివరిగా ఆ నలుగురు లండన్ చేరారా లేదా, వారి ప్రయాణంలో ఎటువంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఇక ఎప్పటి మాదిరిగానే బాద్షా షారుఖ్ ఖాన్ మరొక్కసారి ఈ మూవీలో కూడా తన అద్భుత నటనని కనబరిచారు. ఈ మూవీలో ఆయన హార్ధి అనే పాత్రలో కనిపించారు. యువకుడి దగ్గరి నుండి మధ్యవయస్కుడిగా అలానే వృద్ధిడుగా మూడు కాలాల పాత్రలో షారుఖ్ కనబరిచిన నటన ఎంతో బాగుంది. పలు కీలక సన్నివేశాల్లో ఆయన ఎమోషన్స్ తో మరింతగా ఆడియన్స్ మనసు దోచారు. ఇక మను పాత్రలో కనిపించిన తాప్సి పన్ను కూడా అందం అభినయంతో ఒదిగిపోయి నటించింది. పలు కీలక సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. యువ నటుడు విక్కీ కౌశల్ తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అలానే ఇతర పాత్రల్లో కనిపించిన దియా మీర్జా, బోమన్ ఇరానీ, సతీష్ షా వంటి వారి నటన కూడా బాగుంది.
ముఖ్యంగా కథ పరంగా రాజ్ కుమార్ హిరానీ ఎంచుకున్న పాయింట్ బాగుంది. నలుగురు మిత్రులు విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలనుకోవడం, అయితే అందుకు బాగా డబ్బు కావాలి, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడడం రావాలి, అందుకోసం సక్రమ మార్గంలో ప్రయత్నించిన ఆ ఐదుగురు పూర్తిగా విసిగిపోవడం, అనంతరం అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకోవడం అనే పాయింట్ బాగుంది. అనంతరం వారికి హార్డీ అనే సైనికుడి సాయం వంటి కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. పలు సీన్స్ లో మంచి కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగా పండాయి. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదాగా ఆకట్టుకునే తీరున సినిమా సాగుతుంది. అలానే సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయి.
మరిన్ని మూవీ న్యూస్ కోసం క్లిక్ చేయండి
Dunki Review Telugu
మైనస్ పాయింట్స్ :
గతంలో వచ్చిన తన సినిమాల మాదిరిగానే తన మార్క్ కథ, కథనాలతో డన్కి ని కూడా ఆకట్టుకునే రీతిన ముందుకు నడిపేందుకు ఎంతో ప్రయత్నించారు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. అయితే ఇటువంటి కథలకు భారీ యాక్షన్, థ్రిల్లింగ్, ఫైట్స్ వంటివి జోడించడం కుదరదు. దానితో అక్కడక్కడా కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగదీసినట్లుగా ముందుకు సాగుతాయి. అలానే పలు సీన్స్ ఎమోషనల్ గా ఆకట్టుకున్నప్పటికీ ఈ తరహా కథనం బి, సి వర్గాలకు పెద్దగా చేరువ కాకపోవచ్చు. నిజానికి మొదట డన్కి అనే టైటిల్ ని దీనికి అనౌన్స్ చేసినపుడు చాలా మందికి అది అర్ధం కాలేదు.
అయితే దానికి అర్ధం అక్రమ మార్గంలో సరిహద్దులు దాటడం అని టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఇటువంటి సినిమాలకు ఆకట్టుకునే స్క్రీన్ ప్లే అనేది అవసరం. దానితో పాటు మంచి కామెడీ, అలానే హృద్యమైన భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండాలి. ముందుగా కామెడీతో ఫస్ట్ హాఫ్ చాలా వరకు నడిపిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, మలి భాగంలోనే కొంత తడబడ్డారు. గతంలో తాను తీసిన మున్నాభాయ్ ఎంబిబిఎస్, పీకే, లగేరహో మున్నాభాయ్, సంజు, 3 ఇడియట్స్ వంటి సినిమాలోని భావోద్వేగాలు ఎప్పటికీ కూడా ఆడియన్స్ మనసులో గుర్తుండిపోతాయి. అయితే డన్కి లో మాత్రం అవి కొంత మిస్ అయ్యాయని చెప్పవచ్చు. విక్కీ కౌశల్ యొక్క క్యామియోని మరింతగా చూపించాల్సింది, అలానే ఇంటర్వెల్ సీన్ కూడా పెద్దగా ఆకట్టుకోదు.
Dunki Review Telugu
సాంకేతిక వర్గం :
ఇక డన్కి మూవీకి వర్క్ చేసిన టెక్నీకల్ టీమ్ అందరూ కూడా ఎంతో బాగా పని చేసారు అని చెప్పాలి. ముఖ్యంగా మూవీకి సాంగ్స్ అందించిన ప్రీతం తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అమన్ పంత్ పనితీరు ఎంతో బాగుంది. కొన్ని సాంగ్స్ స్క్రీన్ పై బాగుండడంతో పాటు విజువల్స్ కూడా అలరిస్తాయి. అలానే కెమెరామ్యాన్స్ గా వర్క్ చేసిన సికె మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్ వంటి వారు విజువల్స్ ని ఎంతో గ్రాండియర్ గా ప్రెజంట్ చేసారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ డన్కి కి ఎడిటర్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. అయితే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా పలు సన్నివేశాలు ఒకింత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక నిర్మాతల యొక్క భారీ నిర్మాణ విలువలు డన్కి మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పాలి.
Dunki Review Telugu
తీర్పు :
దాదాపుగా ఐదేళ్ల తరువాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ మూవీ డాన్కి కథ పరంగా బాగున్నప్పటికీ కథనం పరంగా సరైన భావోద్వేగాలతో ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేకపోయారనే చెప్పాలి. చాలా వరకు సినిమా పెద్దగా ఆడియన్స్ ని ఇబ్బందిపెట్టదని చెప్పాలి. ఆసక్తికరమైన కాన్సెప్ట్, ఆకట్టుకునే రీతిన సాగిన నటుల పెర్ఫార్మన్స్, అలరించే పలు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, భారీ నిర్మాణ విలువలు అనేవి డన్కి మూవీకి పెద్ద ప్లస్ గా చెప్పుకోవచ్చు. మొత్తంగా డన్కి అనేది రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ స్కూల్ నుండి వచ్చిన గొప్ప సినిమా అని చెప్పలేము కానీ ఒకసారి చక్కగా చూడగలిగే సినిమా అని మాత్రం చెప్పవచ్చు. అవకాశం ఉంటే హ్యాపీగా ఈ వారం ఈ ఫ్యామిలీ తో కలిసి డన్కిని థియేటర్స్ లో ఒకసారి వీక్షించవచ్చు.
3 thoughts on “Shocking! Dunki Review Telugu l డంకీ రివ్యూ తెలుగు 2023”
Comments are closed.