Oh My God! Salaar Review l సలార్ రివ్యూ ఇది నిజంగా ఊహించలేదు 2023

Written by Movie Updates

Published on:

Salaar Review:- పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల కెరీర్ పరంగా ఆశించిన స్థాయి సక్సెస్ లు అయితే దక్కించుకోలేకపోయారు. అనంతరం KGF సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో Salaar మూవీ చేసేందుకు సిద్ధం అయ్యారు ప్రభాస్. ఇక Salaar Part 1 Ceasefire మూవీని కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించారు. అందాల కథానాయిక శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి, ఈశ్వరరావు, రామచంద్రరాజు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ మూవీకి భువన గౌడ కెమేరామ్యాన్ గా పనిచేసారు. ప్రారంభం నాటి నుండి ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ పై అందరిలో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి నేడు అనగా డిసెంబర్ 22న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన సలార్ మూవీ ఎలా ఉందనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

ఖాన్సార్ అనే నగరానికి తిరుగులేని నాయకుడిగా రాజమన్నార్ (Jagapathi Babu) ఉంటాడు. కాగా తన రెండవ భార్య కొడుకైన వరద మన్నార్ (Prithviraj Sukumaran) ని దొరని చేయాలని భావిస్తాడు రాజమన్నార్. అయితే ఆ నిర్ణయమే ఖాన్సార్ నగరం యొక్క గమనాన్ని మార్చేస్తుంది. వారి చుట్టూ ఉన్నవారంతా కూడా ఎవరికి వారు నాయకుడు అవ్వడం కోసం సైన్యాన్ని కూడగట్టుకుని యుద్దానికి సిద్ధం అవుతారు. అనంతరం పలు పరిణామాలు జరుగడం, దానివలన రాజమన్నార్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు.

ఇక ఒక్కరొక్కరుగా రాజమన్నార్ ని ఎలాగైనా మట్టుబెట్టాలని దాడులు చేస్తుండడం ప్రారంభిస్తారు. అయితే అదేసమయంలో తన చిన్ననాటి స్నేహితుడైన దేవా (Prabhas) యొక్క సహాయం కోరతాడు వరద మన్నార్. మరి స్నేహితుడికి చిన్నపుడు ఇచ్చిన మాట కోసం అక్కడికి వచ్చిన దేవా ఏవిధంగా సహాయం చేస్తాడు, శత్రువుల పై అతడు పోరాడి ఖాన్సార్ ని కాపాడుతాడా లేదా, అసలు ఎవరు ఈ దేవా, ఇతడి నేపథ్యం ఏమిటి, మరి ఇంతకీ చివరికి ఆ యుద్ధంలో దేవా విజయం సాదించాడా లేదా అనేటువంటి విషాలు అన్ని కూడా సినిమాలు చూడాల్సిందే.

Salaar Review

ప్లస్ పాయింట్స్ :

ఇక సలార్ లో ప్రభాస్ నిజంగా తన దేవా పాత్రలో అత్యద్భుతంగా నటించారు అని చెప్పాలి. ఎన్నో ఏళ్ళ నుండి తన ఫ్యాన్స్ ఏవిధంగా కోరుకుంటారో అటువంటి పవర్ఫుల్ రోల్ లోనే కనిపించారు మన బాహుబలి ప్రభాస్. ముఖ్యంగా పలు యాక్షన్, ఫైట్ సీన్స్ లో ప్రభాస్ అదరహో అనిపించారు. ఇక కీలకమైన ఎమోషనల్ సీన్స్ లో కూడా ప్రభాస్ నటన ఎంతో హృద్యంగా ఉంది. అలానే ముఖ్య పాత్ర చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా అదరగొట్టే పెర్ఫార్మన్స్ ని కనబరిచారు. రాజమన్నార్ గా జగపతిబాబు మరొక్కసారి తన సహజ నటనతో ఆడియన్స్ మనసు చూరగొన్నారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన రామచంద్రరాజు, శ్రియా రెడ్డి, బాబీ సింహా కూడా తమ నటనతో అలరించారు.

హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) అందంతో పాటు తన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆమె పాత్ర కూడా సినిమాలో కీలకం కావడం విశేషం. ఇక ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో గ్రాండియర్ విజువల్స్, భారీ యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఖాన్సార్ నగరం చుట్టూ అల్లిన కథ, కొన్ని ట్విస్ట్ లు ఎంతో బాగున్నాయి. ప్రభాస్, శృతి హాసన్ మధ్య వచ్చే సీన్స్ తో పాటు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ఇలా ప్రతి ఒక్క పాత్రని అలానే ఆ పాత్ర చుట్టూ కథకు ఉన్న లింక్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేసి చూపించారు. భువన గౌడ విజువల్స్ తో పాటు రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో బాగుంది.

మైనస్ పాయింట్స్ :

నిజానికి సలార్ మూవీ కథలో మంచి డెప్త్ ఉన్నప్పటికీ కూడా దానిని సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో అక్కడక్కడా మాత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ తడబడ్డారు అని చెప్పాలి. నిజానికి ఫస్ట్ హాఫ్ మొత్తం అద్భుతంగా తెరకెక్కించిన ప్రశాంత్, సెకండ్ హాఫ్ లో మాత్రం కొంత నెమ్మదిగా నడిపారు. అలానే ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్స్ ని మరింతగా హృద్యంగా చూపించాలిస్తుంది. కొన్ని ఇన్సిడెంట్స్ అయితే సినిమాటిక్ గానే అనిపిస్తాయి. చిన్నపుడు ఇచ్చిన మాట కోసం ఇప్పుడు వచ్చి తన స్నేహితుడిని కాపాడుకునే దేవా, అలానే అతడి స్నేహితుడైన వరద ల మధ్య స్నేహానుబంధం యొక్క డెప్త్ తెలిపే విధంగా సీన్స్ మరింత ఎఫెక్టివ్ గా రాసుకుని ఉండాల్సింది. ఇక కెజిఎఫ్, అలానే పొన్నియన్ సెల్వన్ మాదిరిగా ఎంతో గ్రాండ్ గా ఉండడంతో పాటు సలార్ లో కూడా అనేక పాత్రలు ఉంటాయి.

Salaar Review Telugu

సాంకేతిక వర్గం :

ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీని మెజారిటీ ఆడియన్స్, ఫ్యాన్స్ కి చేరువ చేయడంలో సఫలం అయ్యారు అనే చెప్పాలి. అయితే మరింత ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సంగీతం అందించిన రవి బస్రూర్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ అయితే ఎంతో గ్రాండియర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇక (Hombale Films) నిర్మాత విజయ్ కిరగందూర్ భారీ నిర్మాణ విలువలు సలార్ కు ప్రధాన హైలైట్ అని చెప్పాలి.

తీర్పు :

మొత్తంగా అందరూ ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీని హై వోల్టేజ్ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా బాగా తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా సాగుతూ ఆడియన్స్ ని అలరిస్తుంది. ప్రభాస్ సూపర్ పెర్ఫార్మన్స్, ఆకట్టుకునే గ్రాండియర్ విజువల్స్, అలరించే యాక్షన్ సీన్స్, ఫైట్స్, హృద్యమైన ఎమోషనల్ సీన్స్ ఎంతో బాగున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ మెజారిటీ ఆడియన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే మరింత కిక్ ని అందిస్తుంది. యాక్షన్ సీన్స్ రెగ్యులర్ గా అనిపించినా వాటిని తనదైన మార్క్ తో అద్బుతముగా తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. ఓవరాల్ గా ఫ్యామిలీ తో కలిసి హ్యాపీగా సలార్ మూవీ చూసి యాక్షన్ ఎమోషనల్ సీన్స్ ని ఎంజాయ్ చేయవచ్చు.

Movie Updates Rating : 4 / 5

Salaar Review

మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Salaar Review