Sreeleela Biography Unknown Facts Life Secrets l శ్రీలీల బయోగ్రఫీ హైట్ వెయిట్ ఫ్యామిలీ సీక్రెట్స్ 2024

Written by Movie Updates

Published on:

Sreeleela Biography Unknown Facts Life Secrets:- ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలోని యువ కథానాయికల్లో మంచి క్రేజ్, సక్సెస్ లతో కొనసాగుతున్న వారిలో శ్రీలీల కూడా ఒకరు. నటిగా అటు ఆకట్టుకునే అందంతో తోపాటు అలరించే అభినయంతో ఆమె ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి ఎంతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆమె 2001 జూన్ 14న యునైటెడ్ స్టేట్స్ లోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్. ఆమె తండ్రి సూరపనేని శుభాకరరావు. అయితే శ్రీలీల జననానికి ముందే ఆమె తల్లిదండ్రులు ఒకరి నుండి మరొకరు విడాకులు తీసుకున్నారు.

ఇక శ్రీలీల బెంగళూరులోనే పుట్టిపెరిగారు. తన చిన్నతనంలో భరతనాట్యంలో శ్రీలీల ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం జరిగింది. అయితే మొదటి నుండి కూడా డాక్టర్ వృత్తిలో చేరాలనేది శ్రీలీల యొక్క ఆకాంక్ష. 2021 నాటికి ఆమె ఎంబిబిఎస్ లో చేరారు. 2022లో ఆమె గురు, శోభిత అనే ఇద్దరు దివ్యంగా పిల్లలను దత్తత చేసుకున్నారు. అంతకముందు అనాధాశ్రమంలో వారిని చూసి ఎంతో చలించిపోయిన శ్రీలీల ప్రస్తుతం వారికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ సరికొత్త జీవితాన్ని అందిస్తున్నారు. ఏదైనా కష్టపడితే తప్పకుండా మనకు లభిస్తుందని, జీవితంలో ఏది కూడా సులభంగా దక్కదనేది తన అభిప్రాయం అంటుంటారు శ్రీలీల.

ఇక తమ తల్లితండ్రులు విడిపోయిన విషయమై తాను ఒకింత బాధ పడుతుంటాం అని, తండ్రి అప్పుడప్పుడు గుర్తుకు వస్తారని, ఇక తన తల్లి స్వర్ణలత తనను కంటికి రెప్పలా ఎంతో చక్కగా చూసుకుంటారని పలు ఇంటర్వ్యూస్ లో చెప్తుంటారు శ్రీలీల. తన కెరీర్ బిగినింగ్ లో సోషల్ మీడియాలో అకౌంట్స్ కలిగిన శ్రీలీల సరదాగా వీడియోస్ పోస్ట్ చేయడం, అనంతరం అది చూసిన కన్నడ సినిమా వారు తొలి సినిమా అవకాశం ఇవ్వడం జరిగింది.ఆమె తొలిసారిగా 2019లో వచ్చిన కిస్ అనే మూవీ ద్వారా కన్నడ చిత్రసీమకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

ఆ మూవీ తెలుగులో ఐ లవ్ యు ఇడియట్ పేరుతో డబ్ అయింది. అనంతరం కన్నడలో పలు సినిమాలు చేసి మంచి పేరు సొంతం చేసుకున్న శ్రీలీల, ఆపైన తెలుగులో తొలిసారిగా సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా గౌరీ రోణంకి దర్శకత్వంలో రూపొందిన పెళ్లి సందడి మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఆ మూవీ 2021 లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ తో ఆమెకు ధమాకా మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం జరిగింది.

Sreeleela Biography Unknown Facts Life Secrets

త్రినాధరావు నాక్కిన తెరకెక్కించిన ఈ మూవీ 2022 లో రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సొంతం చేసుకుని నటిగా ఆమెకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి శ్రీలీలకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాని అనంతరం రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద, అలానే యువ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ, అలానే నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి, ఇక ఇటీవల యువ నటుడు నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్ట్రా ఆర్దినరి మ్యాన్ సినిమాల్లో నటించి వాటితో ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి మరింత మంచి పేరు సొంతం చేసుకున్నారు శ్రీలీల.

ఇక ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన శ్రీలీల నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సె కాకపోవడంతో, ఇకపై తన సినిమాలు, పాత్రల యొక్క ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తానని అంటున్నారు శ్రీలీల.

ఇక తెలుగులో దాదాపుగా అందరు స్టార్స్ తో నటించడం తనకు ఎంతో ఇష్టం అని, అలానే పలు సినిమాల్లోని నటీనటుల నుండి తాను ఎప్పటికప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నట్లు తెలిపారు శ్రీలీల. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమాలు తనకు హీరోయిన్ గా మరింత మంచి పేరు తీసుకువస్తాయననే నమ్మకం ఉందని, ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టం అయిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో వర్క్ చేస్తుండడం తన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభంగా చెప్తున్నారు శ్రీలీల.

Sreeleela Biography Unknown Facts Life Secrets

ఇక తొలి సినిమా ద్వారా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు వంటి గొప్ప దర్శకుడితో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, చిరంజీవి గారు మొదలుకుని అందరు స్టార్స్ తో వర్క్ చేయాలనేది తన కోరిక అని తెలిపారు. ఇక కన్నడ లో నటీనటులు అందరితో మంచి అనుబంధం ఉందని, తప్పకుండా ఛాన్స్ వస్తే భవిష్యత్తులో ఇతర భాషల్లో కూడా నటిస్తానని ఆమె తెలిపారు.

ఇక ప్రస్తుతం గుంటూరు కారం మూవీ షెడ్యూల్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు శ్రీలీల. మరోవైపు నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ వెరైటీ కామెడీ యాక్షన్ మూవీలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరిలో బాలకృష్ణ కూతురిగా కనిపింపఁచి అందరినీ తన ఆకట్టుకునే అభినయంతో అలరించారు శ్రీలీల.

ఆ సినిమా అద్భుత విజయం తనకు ఎంతో మంచి పేరు తీసుకురావడంతో పాటు బాలకృష్ణ గారి నుండి తాను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు శ్రీలీల. భగవంత్ కేసరిలో తాను పోషించిన విజ్జి పాప పాత్ర ఎంతో నచ్చిందని, అయితే ఛాలెంజింగ్ తో కూడుకున్న ఆ పాత్ర కోసం ఒకింత శారీరకంగా శ్రమపడక తప్పలేదని, కొన్ని సీన్స్ అయితే దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గరుండి చేయించారని, మొత్తంగా ఆ సినిమా అనుభవం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె తెలిపారు.

Sreeleela Biography Unknown Facts Life Secrets

మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sreeleela Biography Unknown Facts Life Secrets

10 thoughts on “Sreeleela Biography Unknown Facts Life Secrets l శ్రీలీల బయోగ్రఫీ హైట్ వెయిట్ ఫ్యామిలీ సీక్రెట్స్ 2024”

  1. Great weblog here! Additionally your site loads up very fast!
    What host are you the usage of? Can I am getting your associate hyperlink on your host?
    I desire my web site loaded up as fast as yours lol

  2. Whats up very cool site!! Man .. Beautiful .. Amazing ..
    I will bookmark your website and take the feeds additionally?
    I am satisfied to seek out numerous helpful info
    here within the put up, we need develop more strategies on this regard,
    thanks for sharing. . . . . .

Comments are closed.