Salaar First Review will Shock You l సలార్ ఫస్ట్ రివ్యూ మీకు షాక్ ఇస్తుంది 2023

Written by Movie Updates

Published on:

Salaar First Review will Shock You:- పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై KGF సిరీస్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ మూవీ పై మొదటి నుండి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి భువన గౌడ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. అందాల నటి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియారెడ్డి, ఈశ్వరరావు, జగపతిబాబు, టిన్ను ఆనంద్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఇటీవల సలార్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, థియేట్రికల్ ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ ఇలా అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై అంచనాలు తారా స్థాయికి తీసుకెళ్లాయి. అలానే సలార్ నుండి రిలీజ్ చేసిన సూరీడే అనే పల్లవితో సాగె ఎమోషనల్ సాంగ్ కూడా అందరినీ ఎంతో అలరించింది. దానితో సలార్ ఎప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూస్తామా అనే ఆసక్తి అందరిలో కూడా విపరీతంగా ఏర్పడింది. కాగా విషయం ఏమిటంటే, సలార్ కి సంబంధించి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న ఫస్ట్ రివ్యూ ని బట్టి చూస్తే మూవీ అదిరిపోనుందని తెలుస్తుంది.

Salaar First Review will Shock You

ముందుగా ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే సినిమాలో అత్యద్భుతంగా ఉంటుందట. గ్రాండ్ లెవెల్లో ప్రభాస్ మాస్ స్టైల్ లో ఎంట్రీ ఇస్తారని, ఆ సీన్ కి థియేటర్స్ మొత్తం షేక్ అవడం ఖాయం అంటున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ లో రెండు ఫైట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఆకట్టుకోవడంతో పాటు ఇంటర్వెల్ లో వచ్చే భారీ యాక్షన్ సీన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందట. ఇంటర్వెల్ అనంతరం సెకండ్ హాఫ్ లో మొత్తంగా మూడు భారీ యాక్షన్ సీన్స్ ఉండగా అందులో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయట. ముఖ్యంగా సలార్ లో ప్రభాస్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ అత్యద్భుత టేకింగ్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు.

అలానే గ్రాండియర్ విజువల్స్ తో పాటు ఆకట్టుకునే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని అలరిస్తాయట. వీటితో పాటు హీరోయిన్ శృతి హాసన్, కీలక పాత్రలు చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు వంటి వారు తమ తమ పాత్రలతో ఆకట్టుకుంటారట. మొత్తంగా అయితే Salaar Part 1 Ceasefire మూవీ డిసెంబర్ 22న రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో పాటు భారీ స్థాయి కలెక్షన్ ని కూడా దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరొక రెండు రోజుల్లో మన అందరి ముందుకి రానున్న సలార్ ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Salaar First Review will Shock You

 

మరిన్ని మూవీ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Salaar First Review will Shock You

1 thought on “Salaar First Review will Shock You l సలార్ ఫస్ట్ రివ్యూ మీకు షాక్ ఇస్తుంది 2023”

Comments are closed.