Salaar Pre Release Talk will Mind Block You l మైండ్ బ్లాక్ చేస్తున్న సలార్ ప్రీ రిలీజ్ టాక్ 2023

Written by Movie Updates

Published on:

Salaar Pre Release Talk will Mind Block You:- టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా KGF సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ సెన్సేషనల్ మాస్ యాక్షన్ మూవీ Salaar Part 1 Ceasefire. ఈ మూవీని కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ Hombale Films వారు గ్రాండ్ లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరరావు, రామచంద్ర రాజు, టిన్ను ఆనంద్ వంటి వారు నటిస్తున్నారు.

Salaar Pre Release Talk will Mind Block You

ఇక ఈ మూవీని డిసెంబర్ 22న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక సలార్ లో ప్రభాస్ మంచి మాస్ పాత్ర చేస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన గౌడ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇక ఇటీవల సలార్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సూరీడే అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని అటు ప్రభాస్ ఫ్యాన్స్ లో ఇటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ మూవీకి సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ అందించారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, మరొక రెండు రోజుల్లో భారీ స్థాయి థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ టాక్ మైండ్ బ్లాక్ చేస్తోంది.

ముఖ్యంగా పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతునన్ న్యూస్ ప్రకారం సలార్ లో మొత్తం రెండు సాంగ్స్ ఉన్నాయట, అలానే హీరో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ని మాస్ రేంజ్ లో డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. అలానే ఫస్ట్ హాఫ్ లో మొత్తం రెండు ఫైట్స్ ఉండగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ గ్రాండ్ లెవెల్లో ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్ లో మొత్తం మూడు ఫైట్స్ ఉండగా మూడు కూడా అదిరిపోతాయట.

ఇక క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అయితే అత్యంత భారీ స్థాయిలో ఉంటుందని టాక్. ఇక సలార్ లో ప్రశాంత్ నీల్ టేకింగ్ తో పాటు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ల పవర్ఫుల్ యాక్టింగ్, మాస్ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండియర్ విజువల్స్, అదిరిపోయే ఫైట్స్ ఇలా ప్రతి అంశం కూడా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుని రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు. మరొక రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానున్న సలార్ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Salaar Pre Release Talk will Mind Block You

 

మరిన్ని మూవీ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Salaar Pre Release Talk will Mind Block You