Oh God! Animal Latest Collection Details 2023 l ఆనిమల్ లేటెస్ట్ కలెక్షన్ డీటెయిల్స్ 2023

Written by Movie Updates

Published on:

Animal Latest Collection Details 2023:- బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ Animal. ఈ మూవీని టి సిరీస్ ఫిలిమ్స్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో రెండు భారీ విజయాలు సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగా, ఆనిమల్ తో మరొక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఫస్ట్ నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఆనిమల్ మూవీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకుని రిలీజ్ డే ఫస్ట్ షో నుండే సూపర్ గా రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

Animal Latest Collection Details 2023

భారీ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొంది పలు భాషల ముందుకి వచ్చిన ఆనిమల్ అన్ని భాషల్లో కూడా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విపరీతమైన కలెక్షన్స్ తో దూసుకెళ్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో హీరో రణబీర్ కపూర్ వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి అద్భుత దర్శకత్వ ప్రతిభకు ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి మంచి ప్రసంశలు లభిస్తున్నాయి. నిజానికి ఆనిమల్ పై కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తినప్పటికీ ఎక్కడా కూడా అది కలెక్షన్ పై ప్రభావం చూపలేదు. ఇక ఈ మూవీ హిందీలో మరింత భారీ స్థాయి కలెక్షన్ తో కొనసాగుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. తాజాగా ఈ మూవీ ఇండియన్ వైడ్ ఇటీవల రూ. 500 కోట్ల నెట్ కలెక్షన్ మార్క్ ని దాటేసింది.

ఇక పలువురు ట్రేడ్ అనలిస్టులు వెల్లడిస్తున్న తాజా సమాచారాన్ని బట్టి ఆనిమల్ మూవీ ఇప్పటివరకు రూ. 512. 94 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుంది. ఇక ఆనిమల్ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన టోటల్ కలెక్షన్ రూ. 817. 36 కోట్లుగా నమోదయింది. అలానే ఈ మూవీ ఇప్పటివరకు అటు కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న హిందీ మూవీగా రికార్డు నెలకొలిపింది. అలానే 2023లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్న సినిమాల లిస్ట్ లో నిలిచింది ఆనిమల్. మొత్తంగా ఈ లిస్ట్ లో నిలిచిన ఐదు సినిమాల్లో The Kerala Story రూ. 302 కోట్లు, Gadar 2 రూ. 686 కోట్లు, Pathaan రూ. 1055 కోట్లు, Jawan రూ. 1160 కోట్లతో మిగతా లిస్ట్ లో నిలిచాయి. మరి రాబోయే రోజుల్లో Animal మూవీ ఇంకెంతమేర కలెక్షన్ కొల్లగొట్టి దూసుకెళ్తుందో చూడాలి.

Animal Latest Collection Details 2023

 

మరిన్ని మూవీ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Animal Latest Collection Details 2023