It’s sad to see the condition of Ram Charan fans l పాపం రామ్ చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి చూస్తే జాలేస్తుందబ్బా 2023

Written by Movie Updates

Published on:

It’s Sad To See The Condition Of Ram Charan Fans:- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గత ఏడాది మార్చిలో RRR మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. మరొక నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేసారు. రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ గ్లోబల్ గా ఎంతో గొప్ప పేరు సొంతం చేసుకోవడంతో పాటు భారీ స్థాయి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ అనంతరం భారీ సినిమాల దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు చరణ్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

It’s sad to see the condition of Ram Charan fans

ప్రారంభం నాటి నుండి ఈ క్రేజీ మూవీ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీని భారీ యాక్షన్ తో కూడిన పొలిటికల్ డ్రామా మూవీగా శంకర్ తెరకెక్కిస్తున్నారు శంకర్. ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ అయిన జరగండి జరగండి అనే పల్లవితో సాంగ్ ని ఇటీవల దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నాం అంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నిజానికి ఈ సాంగ్ అంతకుముందే సోషల్ మీడియాలో లీక్ అయి మంచి క్రేజ్ అందుకుంది.

దానితో ఒరిజినల్ వర్షన్ సాంగ్ అయితే మరింత అద్భుతంగా ఉంటుందని, వినాలి అనే ఆశతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసారు. అయితే కొన్ని కారణాల వలన దీపావళి నుండి వరుసగా ఆ సాంగ్ రిలీజ్ కాకుండా వాయిదా పడుతూ వస్తోంది. ఇక న్యూ ఇయర్ కూడా రానుండడంతో తమ హీరో నటిస్తున్న గేమ్ ఛేంజర్ నుండి ఒక్క అప్ డేట్ కూడా మేకర్స్ ఇవ్వడం లేదని, మరోవైపు అసలు ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా అర్ధం కావడంలేదని, త్వరలో ఈ విషయమై మేకర్స్ త్వరలో స్పందించాలని కోరుతూ పలువురు చరణ్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2024 లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం కనపడుతోంది.

 

It's sad to see the condition of Ram Charan fans

 

మరిన్ని మూవీ న్యూస్ కోసం క్లిక్ చేయండి

It’s sad to see the condition of Ram Charan fans

1 thought on “It’s sad to see the condition of Ram Charan fans l పాపం రామ్ చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి చూస్తే జాలేస్తుందబ్బా 2023”

Comments are closed.