WOW! Guntur Karam Third Song Release Date Fixed | గుంటూరు కారం మూడవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ 2023

Written by Movie Updates

Updated on:

Guntur Karam Third Song Release Date Fixed:-  సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను, వంశీ పైడిపల్లి తీసిన మహర్షి, అనంతరం అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు, అలానే ఇటీవల పరశురామ్ పెట్ల తీసిన సర్కారు వారి పాట మూవీస్ ద్వారా కెరీర్ పరంగా వరుసగా నాలుగు సక్సెస్ లు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక దాని అనంతరం త్రివిక్రమ్ తో గుంటూరు కారం మూవీ స్టార్ట్ చేసారు సూపర్ స్టార్. ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్ హైపర్ ఆది, బ్రహ్మానందం, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు.

ఈ మూవీలో చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత మహేష్ బాబు ఊర మాస్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా యువ అందాల భామలు శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల గుంటూరు కారం నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ మాస్ స్ట్రైక్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా అలానే సెకండ్ సాంగ్ ఓ మై బేబీ అన్ని కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ ని సొంతం చేసుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి.

Guntur Karam Third Song Release Date Fixed

ఇక లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ అప్ డేట్ ప్రకారం ఈ మూవీ నుండి మూడవ సాంగ్ ని డిసెంబర్ 23న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ మాస్ సాంగ్ ని టాక్. ఈ మూవీని మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలి కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా పన్నెండేళ్ల విరామం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో తాను చేస్తున్న ఈ మూవీ ఎలాగైనా భారీ సక్సెస్ సొంతం చేసుకోవాలనే కసితో దర్శకుడు త్రివిక్రమ్ దీని కోసం ఎంతో కష్టపడుతున్నట్లు చెప్తోంది యూనిట్. కాగా గుంటూరు కారం మూవీని రానున్న 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

 

మరిన్ని మూవీ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Guntur Karam Third Song Release Date Fixed