Yay! Hi Papa Box Office Collection l హాయ్ నాన్న బాక్సాఫీస్ కలెక్షన్ 2023

Written by Movie Updates

Published on:

Hi Papa Box Office Collection:- నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలి యాక్షన్ పాన్ ఇండియన్ ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీ హాయ్ నాన్న. ఈ మూవీ పై ప్రారంభము నాటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉండగా డిసెంబర్ 7న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఈ మూవీలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించగా జయరాం, నాజర్, ప్రియదర్శి వంటి వారు కీలక పాత్రలు పోషించారు.

Hi Papa Box Office Collection

ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండి అన్ని ప్రాంతాల్లో అలానే అన్ని భాషల్లో కూడా హాయ్ నాన్న మూవీ మంచి కలెక్షన్ ని రాబడుతోంది. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ మూవీ 12 రోజుల్లో రూ. 39.54 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ యొక్క టోటల్ బడ్జెట్ రూ. 40 కోట్లు. మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా అటు యుఎస్ఎస్ లో సైతం హాయ్ నాన్న యొక్క హవా కొనసాగుతోంది.

మరోవైపు మరొక మూడు రోజుల్లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సలార్ రాక తరువాత హాయ్ నాన్న మూవీ చాలా యేరీల్లో కలెక్షన్ తగ్గుముఖం పెట్టె అవకాశం ఉందని, ఈలోపు మూవీ వీలైనంత ఎక్కువగా రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు సినీ ట్రేడ్ విశ్లేషకులు. యువ దర్శకుడు శౌర్యువ్ ఈ మూవీని హృద్యంగా తెరకెక్కించడంతో పాటు ఆడియన్స్, నాని ఫ్యాన్స్ యొక్క మనసు దోచారు. నిజానికి ఈ మూవీని సరైన విధంగా ప్లాన్ చేసి రిలీజ్ చేసి ఉంటె ఈపాటికి మరింత కలెక్షన్ లభించేదనేది పలువురు ప్రేక్షాభిమానుల యొక్క అభిప్రాయం.

Hi Papa Box Office Collection

 

మరిన్ని మూవీ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Hi Papa Box Office Collection