Keedaa Cola OTT Release Date Shocking l కీడా కోలా ఓటిటి రిలీజ్ డేట్ షాకింగ్ 2024

Written by Movie Updates

Published on:

Keedaa Cola OTT Release Date:- తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చైతన్య రావు మదాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్, విష్ణు ఓఐ, రవీంద్ర విజయ్, రఘురాం తదితరులు తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ కీడా కోలా. విజి సైన్మా బ్యానర్ పై కె వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందించగా ఏజే ఆరోన్ ఫోటోగ్రఫి అందించారు.

keedaa cola release date ott

అనౌన్స్ మెంట్ నుండి అందరిలో మంచి లంచాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి యావరేజ్ విజయం అందుకుంది. వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతున్న వాసు అనే వ్యక్తి తన స్నేహితుడు కౌశిక్ ఇచ్చిన కీడా కోలా బాటిల్ సలహాతో కోట్ల రూపాయలు సంపాదించాలనుకోవడం, అనంతరం దాని వలన ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది.

keedaa cola movie ott release date

ఇక ఈమూవీ పరంగా చూస్తే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎంచుకున్న కథాంశం బాగున్నప్పటికీ దానిని మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించి ఉంటె బాగుండేది. కొంత కథ బోర్ గా సాగడం, సెకండ్ హాఫ్ లో ఉన్నంత ఫన్ ఫస్ట్ హాఫ్ లో మిస్ అవ్వడం, అలానే పలు సీన్స్ లో నాటకీయత ఎక్కువ అవడం వంటివి ఈ సినిమాని ఆడియన్స్ కి ఎక్కువగా చేరువ చేయలేకపోయాయి. సినిమాలో సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి.

keedaa cola ott platform release date

అలానే టేకింగ్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని లాజిక్ లెస్ సీన్స్ ఉండడం, రొటీన్ కామెడీ మూవీగా సాగడం దీనికి ప్రతికూల అంశాలు. ఇక ప్రధాన పాత్రల్లో నటించిన చైతన్య రావు, రామ్ మయూరి, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్ సహా ప్రతి ఒక్కరూ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అయితే సంగీతం తో పాటు విజువల్స్ కూడా బాగున్నాయి.

keedaa cola ott release time

మొత్తంగా థియేటర్స్ లో పర్వాలేదనిపించిన కీడా కోలా మూవీ ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా థియేటర్స్ కంటే కూడా ఓటిటి లోనే ఆడియన్స్ ని మరింతగా అలరిస్తూ దూసుకుపోతోంది. మొత్తంగా కీడా కోలా మూవీకి మంచి రెస్సాన్స్ లభిస్తుండడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

keedaa cola ott release date

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Keedaa Cola OTT Release Date

1 thought on “Keedaa Cola OTT Release Date Shocking l కీడా కోలా ఓటిటి రిలీజ్ డేట్ షాకింగ్ 2024”

Comments are closed.