Tamil Actress Tamil Actress Shocking Movies l తమిళ్ న్యూ హీరోయిన్స్ లిస్ట్ 2024

Written by Movie Updates

Published on:

Tamil Actress Tamil Actress:- నిజానికి బాలీవుడ్ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ మర్కెట్స్ సినిమాల పరంగా ఎంతటి పెద్దవో మనకు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పలువురు తమిళ స్టార్స్ తెలుగు లోను సినిమాలు చేసి మంచి సక్సెస్ అయినవారున్నారు. అలానే పలువురు తమిళ హీరోయిన్స్ అక్కడతో పాటు ఇక్కడ కూడా నటించి మెప్పించిన వారున్నారు.

 

ఇక ఇటీవల కోలీవుడ్ లో పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి తమ ఆకట్టుకునే అందం, అభినయంతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించి మంచి పేరు సొంతం చేసుకున్న కొందరు హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ఇక ప్రతి ఒక్క హీరోయిన్ కూడా తమ తమ టాలెంట్స్ తో మెల్లగా ఒక్కొక్కటిగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని పైకి వచ్చిన వారే అని చెప్పాలి.

 

ఇక ప్రస్తుతం తమిళ్ లో పలువురు హీరోయిన్స్ స్టార్స్ గా మంచి పేరుతో కొనసాగుతున్నారు. వారి లిస్ట్ ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మా సైట్ లోని ఇతర ఆర్టికల్స్ ని కూడా ఒకసారి చెక్ చేయండి.

tamil actress list

నయనతార : (Nayanthara) స్టార్ నటీమణిగా ప్రస్తుతం నయనతార వరుసగా అఫర్స్ తో కొనసాగుతున్నారు. నిజానికి ఫస్ట్ మూవీ నుండి ప్రతి సినిమాతో కూడా మంచి సక్సెస్ లతో పాటు క్రేజ్ కూడా అందుకుంటూ దూసుకెళ్తున్నారు నయనతార. తొలిసారిగా పి వాసు దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా నటించిన చంద్రముఖి మూవీ ద్వారా నయనతార తమిళ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

 

నిజానికి ఆమె ఒక మలయాళీ. అయినప్పటికీ కూడా తనదైన ఆకట్టుకునే అందం అభినయంతో వచ్చిన ఒక్కో అవకాశాన్ని వినియోగించుకుని కోలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించి తమిళ్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు నయన్. ఇక ఇటీవల ప్రముఖ యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న నయనతార, ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు చిన్న కుటుంబంతో హ్యాపీగా గడుపుతూ మరోవైపు సినిమాలు చేస్తున్నారు.

 

త్రిష : (Trisha Krishnan) తమిళ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరు త్రిష. తొలిసారిగా 1999లో వచ్చిన జోడి సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు త్రిష. ఆ తరువాత స్టార్ యాక్టర్ సూర్య హీరోగా తెరకెక్కిన మౌనం పెసియాదే మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ ని ఫ్యాన్స్ ని అలరించారు.

tamil actress name list

ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలను అందిపుచ్చుకుని కెరీర్ పరంగా దూసుకెళ్లిన త్రిష, ఆ తరువాత అక్కడి ఇతర స్టార్ హీరోల సరసన కూడా పలు సినిమాలు చేసారు. ఇక ఇటీవల ఇలయథలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న త్రిష, ప్రస్తుతం మరికొన్ని క్రేజీ ప్రాజక్ట్స్ తో కొనసాగుతున్నారు.

 

కీర్తి సురేష్ : (Keerthy Suresh) తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ తో ఆడియన్స్ ఫ్యాన్స్ యొక్క ప్రేమతో కొనసాగుతున్న హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరు. ఆమె తొలిసారిగా 2015లో విక్రమ్ ప్రభు హీరోగా రూపొందిన ఇదు ఎన్న మాయం మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే విజయం అందుకున్నారు.

 

ఆ తరువాత రెమో, భైరవ సినిమాలు ఆమెకు హీరోయిన్ గా మాతింత మంచి పేరుని తీసుకువచ్చాయి. అనంతరం పలువురు ఇతర తమిళ స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించారు కీర్తి సురేష్. ఇక ఇటీవల ఉదయనిధి స్టాలిన్, వడివేలు కలిసి నటించిన మామన్నన్ మూవీలో కూడా ఆమె నటించి ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం తమిళ్ తో పాటు పలు చిత్ర సీమల్లో సినిమాల అవకాశాలతో కొనసాగుతున్నారు కీర్తి సురేష్.

tamil actress latest

శృతి హాసన్ : (Shruti Haasan) లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తె అయిన శృతి హాసన్ బాలనటిగా తన తండ్రి నటించిన పలు సినిమాల్లో కనిపించారు. ఇక మొదటి నుండి యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్ వంటి వాటి పై ఎంతో మక్కువ గల శృతి, తొలిసారిగా 7 ఆమ్ అరువు మూవీ దవారా సూర్య సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు.

 

అనంతరం ధనుష్ తో 3, విశాల్ తో పూజై సినిమాలలో కూడా ఆమె నటించి తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించారు. ఇక అక్కడి నుండి పలువురు ఇతర స్టార్ హీరోల సరసన కూడా నటించి ఆకట్టుకున్న శృతి హాసన్ ఇటీవల విజయ్ సేతుపతి నటించిన లాభం  మూవీలో హీరోయిన్ గా నటించారు. ఇక ప్రస్తుతం పలు తమిళ సినిమా అవకాశాలతో ఆమె దూసుకుపోతున్నారు.

tamil actress tamil actress

ప్రియాంక మోహన్ : (Priyanka Arul Mohan) తమిళ్ లో మంచి క్రేజ్ తో ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో ప్రియాంక మోహన్ కూడా ఒకరు. 2021 లో శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన డాక్టర్ మూవీ ద్వారా తమిళ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక మోహన్. ఆ మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు నటిగా ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది.

 

అనంతరం అనంతరం డాన్ తో పాటు ఇటీవల కెప్టెన్ మిల్లర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి సక్సెస్ లు సొంతం చేసుకున్నారు ప్రియాంక. ఇక ప్రస్తుతం జయం రవి హీరోగా ఎం రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ్ మూవీ బ్రదర్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలానే ఇతర భాషల్లో కూడా ఆమెకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

tamil actress new

స్నేహ : (Sneha) 2000వ సంవత్సరంలో మాధవన్ హీరోగా జె సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నవలె మూవీ ద్వారా కోలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు స్నేహ. ఆ మూవీ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్నారు. అక్కడి నుండి తమిళ్ తో పాటు తెలుగులో కూడా పలు సినిమా అవకాశాలు అందుకున్న స్నేహ, ఇటీవల షాట్ బూట్ త్రి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.

 

మొదటి నుండి కూడా తనకు లభించిన పాత్రల్లో అందం అభినయంతో అందరినీ ఆకట్టుకున్న స్నేహ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇలయథలపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం లో నటిస్తున్నారు.

 

తమన్నా భాటియా : (Tamannaah Bhatia) తమిళ్ లో ప్రస్తుతం బాగా క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో తమన్నా భాటియా కూడా ఒకరు. తొలిసారిగా 2006లో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రవి కృష్ణ హీరోగా తెరకెక్కిన కేడి మూవీ ద్వారా ఆమె తమిళ చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చారు.

 

ఆ తరువాత వ్యాబారి, కల్లూరి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. అనంతరం తెలుగుతో పాటు తమిళ్ లో కూడా పలువురు స్టార్స్ సరసన నటించి మంచి పేరు సొంతం చేసుకున్న తమన్నా, ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ తెరకెక్కించిన జైలర్ లో ఒక కీలక పాత్ర చేసారు. ఇక ప్రస్తుతం సుందర్ సి తెరకెక్కిస్తున్న అరన్మానై 4 లో నటిస్తున్నారు.

 

హన్సిక మోత్వానీ : (Hansika Motwani) 2010లో ధనుష్ హీరోగా సూరజ్ దర్శకత్వంలో తెరకెక్కన మాప్పిళ్ళై మూవీ ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు హన్సిక. ఆ మూవీ ద్వారా తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మెప్పించిన హన్సిక అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు.

 

ఇక ఇటీవల మహా, పార్ట్నర్ మూవీస్ ద్వారా మరింత మంచి క్రేజ్ అందుకున్న హన్సిక, పలువురు స్టార్ హీరోల సరసన కూడా నటించి సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం రౌడీ బేబీ, గార్డియన్, మాన్ వంటి తమిళ సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు హన్సిక.

tamil actress tamil actress

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

tamil actress tamil actress

1 thought on “Tamil Actress Tamil Actress Shocking Movies l తమిళ్ న్యూ హీరోయిన్స్ లిస్ట్ 2024”

Comments are closed.