Latest Prime Webseries: ఇటీవల కాలంలో ఆడియన్స్ ఎక్కువగా ఓటిటి కంటెంట్ చూస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా అనంతరం అవి ఓటిటి లోకి ఎప్పుడు వస్తాయి అనే విధంగా ఎదురు చూపులు చూస్తున్న వారు కూడా లేకపోలేదు. ఇక యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో కూడా సినిమాలు అందుబాటులో ఉండడంతో ఓటిటి లో సినిమాలు, సిరీస్ లను ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ గా తమ ఆడియన్స్ ముందుకి తీసుకువస్తున్నాయి పలు ఓటిటి సంస్థలు. ఆ విధముగా కొన్నేళ్లుగా మంచి పేరు గాంచిన ప్రముఖ ఓటిటి సంస్థలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో బాగా క్రేజ్ అందుకున్న కొన్ని వెబ్ సిరీస్ ల యొక్క డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
Prime play webseries online
1. కుమారి శ్రీమతి (Kumari Srimathi) : ఇప్పటివరకు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ అందరి మన్ననలు అందుకున్న యువ అందాల నాయిక నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంట్రటైనేర్ సిరీస్ కుమారి శ్రీమతి. తమ తాతల ఆస్థి కోర్ట్ లో ఉంటుంది, దాని కోసం తన మావయ్య కేసు వేస్తాడు. అయితే అది ఎలాగైనా చేజిక్కించుకోవాలని కేవలం రూ. 13,000 ల రూపాయల జీతం గల కుమారి, ఒక బిజినెస్ ని ప్రారంభిస్తుంది. అయితే మెల్లగా అది వృద్ధి చెందుతుంది. కానీ అనంతరం కొన్ని సమస్యలు ఎదుర్కొన్న కుమారి చివరికి ఆ ఆస్తిని దక్కించుకుందా లేదా అనేది మిగతా స్టోరీ. ఇందులో నిత్యా మీనన్ తో పాటు సీనియర్ నటి గౌతమి, తిరువీర్ ప్రధాన పాత్రలు చేసారు. ఇక ఈ సిరీస్ ని గోమ్ టేష్ ఉపాధ్య్ తెరకెక్కించారు.
2. హాస్టల్ డేస్ (Hostel Days) : యూత్‌ఫుల్ కథాంశంతో ఇంట్రెస్టింగ్ అంశాలతో తెరకెక్కింది హాస్టల్ డేస్ సిరీస్. హిందీ వెబ్ సిరీస్ అయిన హాస్టల్ డేజ్ కి తెలుగు ఎడాప్షన్ ఇది. ఇక ఈ సిరీస్ లో దరహస్ మాటూరు, అక్షయ్ లాగసాని, మౌళి తనూజ్ ప్రశాంత్, అనన్య ఆకుల, ఐశ్వర్య హోల్కల్ తదితరులు ప్రధాన పాత్రలు చేసారు. అయితే ఇది ప్రధానంగా ఆరుగురు ఇంజనీరింగ్ హాస్టల్ విద్యార్థుల యొక్క లైఫ్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా కామెడీ, యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ఇక ఈ సిరీస్ కి యువత నుండి మంచి రెస్పాన్స్ అయితే లభిస్తోంది.
Best webseries on amazon prime
3. గ్యాంగ్ స్టార్స్ (Gangstars) : ఇది ఇద్దరు ధారావాహిక సినీ తారలు, ఇద్దరు మాజీ ప్రేమికులు, ఒక గ్యాంగ్ స్టర్ జీవితాలతో సినీ పరిశ్రమ నేపథ్యంలో సాగుతుంది. అయితే అనూహ్యంగా జరిగే ఒక సంఘటన వీరందరినీ ముడిపెట్టి ఒక హత్యతో ముగుస్తుంది. ఈ సిరీస్ లో విలక్షణ నటుడు జగపతిబాబు, నవదీప్, సిద్దు జొన్నలగడ్డ, శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్రల్లో నటించగా అజయ్ భూయాన్ తెరకెక్కించారు. ఆకట్టుకునే కథనాలతో ఇంట్రెస్టింగ్ గా అలానే థ్రిల్లింగ్ గా గ్యాంగ్ స్టార్స్ సిరీస్ సాగుతుంది. ముఖ్యంగా జగపతిబాబు, సిద్దు, నవదీప్ తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
4. మోడరన్ లవ్ హైదరాబాద్ (Modern Love Hyderabad) : హైదరాబాద్ లో జరిగే ఆరు విభిన్న లవ్ స్టోరీస్ తో పలు రకాల ఎమోషన్స్ తో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ ని నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బాహుదానం దీనిని తెరకెక్కించారు. ఇక ఈ సిరీస్ లోని కీలక పాత్రల్లో బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్, నిత్యా మీనన్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, సీనియర్ యాక్టర్ నరేష్, సుహాసిని, రేవతి తదితరులు నటించారు. అయితే ప్రతి ఒక్క పాత్రధారి యొక్క నటనతో పాటు లవ్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ మోడరన్ లవ్ హైదరాబాద్ లో ఎంతో ఆకట్టుకుంటాయి.
Prime play webseries list
5. సుడల్ (Suzhal The Vortex) : ఇక ఈ సిరీస్ ముఖ్యంగా ఒక యువతిని నీలగిరీస్ ప్రాంతంలో కిడ్నాప్ చేయడం నేపథ్యంతో సాగుతుంది. మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్స్ గల ఈ సిరీస్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. తమిళ్ లో తెరకెక్కినప్పటికీ కూడా తెలుగు ఆడియన్స్ ని కూడా ఇది ఎంతో అలరించింది. ఆర్ పార్తీబన్, కథిర్, ఐశ్వర్య రాజేష్, శ్రియా రెడ్డి, తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ ని బ్రమ్మ జి & అనుచరణ్ మురుగాయన్ తెరకెక్కించారు. ఇక ప్రతి ఒక్క నటుడు తమ తమ పాత్రల్లో ఒదిగి నటించడంతో ఈ సిరీస్ కి పెద్ద ప్లస్ అయింది.
Latest prime webseries 2024
6. వాదంది (Vadhandhi) : ఇక ఈ వెబ్ సిరీస్ అయితే ఒక యువతీ మరణం, ఆ తరువాత జరిగే గాసిప్, తప్పుడు సమాచారం చుట్టూ తిరుగుతుంది. ఒక పోలీసు, ఒక నవలా రచయిత ఆమె వ్యక్తిత్వం, అలానే ఆమె మరణానికి దారితీసిన సంఘటనలతో మునిగిపోవడం అనే ఆసక్తికర కథ, కథనాలతో సాగుతుంది. ఇక ఈ సిరీస్ లో ప్రముఖ వెర్సటైల్ యాక్టర్ ఎస్ జె సూర్య, లైలా, నాజర్, సంజన కృష్ణమూర్తి, వివేక్ ప్రసన్న, వైభవ్ మురుగేశన్ తదితరులు కీలక పాత్రలు చేసారు. ఆండ్రూ లూసిస్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ ని తెరకెక్కించి ఆద్యంతం మనల్ని అలరించేలా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అందరి ఆదరణ అందుకుంటోంది.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Prime Webseries