OTT Releases This Week l ఈవారం ఓటిటిలో రిలీజ్ అయ్యే మూవీస్ 2024

Written by Movie Updates

Published on:

OTT Releases This Week:- ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మీడియా మాధ్యమాల యొక్క వినియోగం ఎక్కువ అయింది. ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం యూట్యూబ్ రాకతో అది మెల్లగా పెరగడం ప్రారంభం అయింది. ఇక యూట్యూబ్ లో అప్పట్లో కొన్ని సినిమాలు అప్ లోడ్ చేసేవారు.

అనంతరం కరోనా టైంలో థియేటర్స్ కొన్ని నెలల పాటు నిరవధికంగా మూతపడడంతో ఓటిటి అనేది రంగప్రవేశం చేసి మెల్లగా ఆడియన్స్ కు చేరువ అయింది. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా ఓటిటి మాధ్యమాలు ఆడియన్స్ కు చేరువ అవుతూ వచ్చాయి. అనంతరం పలు సినిమాలను థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటిటి లో రిలీజ్ చేయడం . ఇక ఇటీవల అయితే థియేటర్స్ రిలీజ్ లు పూర్తి అయిన అనంతరం పలు సినిమాలు ఒక్కొక్కటిగా ఓటిటి ఆడియన్స్ ముందుకి వస్తున్నాయి.

new ott releases this week

ఇక ప్రస్తుతం ఆ ట్రెండ్ విపరీతంగా కొనసాగుతోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఈటివి విన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లివ్ ఇలా పలు ఓటిటి మాధ్యమాలు ఎప్పటికప్పుడు పలు రకాల సినిమాలు, సిరీస్ లు తమ ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చి వారిని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ విధంగా ఈ వారం ఆడియన్స్ ముందుకి వచ్చిన సిరీస్ లతో పాటు సినిమాలు కూడా ఇప్పుడు చూద్దాం.

భక్షక్ (Bhakshak) : భూమి ఫెడ్నేకర్, సంజయ్ మిశ్రా, సాయి తమంకర్, ఆదిత్య శ్రీవాత్సవ తదితరులు కీలక పాత్రలు చేసిన తాజా థ్రిల్లర్ మూవీ భక్షక్ ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. మునావర్ పూర్ లోని ఒక బాలికల వసతి గృహంలో వారి పై లైంగిక దాడులు జరుగుతున్నాయనే విషయం తన న్యూస్ ఛానల్ ద్వారా బయటపెట్టిన ఒక లేడీ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, అనంతరం బాలికలని ఎలా దుర్మార్గుల నుండి కాపాడడానికి ఎలాంటి పోరాటం చేసింది అనేది ప్రధాన కథ.

ott releases this week binged

ఇందులో ప్రధాన పాత్ర పోషించిన భూమి ఫడ్నేకర్ అద్భుతంగా నటించారు. ఇక ఆమెకు కెమెరా మ్యాన్ గా వర్క్ చేసిన సంజయ్ మిశ్ర తో పాటు ప్రతి ఒక్కరూ కూడ ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ కనబరిచారు. ఈ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ ని దర్శకుడు ఫుల్ కిత్ ఆకట్టుకునే రీతిన తెరకెక్కించారు. థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడే వారికి అలానే సామజిక అంశాలకు సంబందింసీనిన సినిమాల ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది. ముఖ్యంగా ఇందులోని మెసేజ్ నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది.

గుంటూరు కారం (Guntur Kaaram) : టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, రఘుబాబు కీలక పాత్రలు చేసారు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మించింది.

ott movies releasing this week

చిన్నప్పుడే తల్లి నుండి విడిపోయిన కొడుకు పెరిగి పెద్దయ్యాక మళ్ళి ఆమెను ఏవిధంగా కలుసుకుని తల్లిని తండ్రిని కలిపాడు అనే ఇతివృత్తంతో ఈ మూవీ రూపొందింది. ఇందులో రమణ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్క పాత్రధారి నటన అలానే త్రివిక్రమ్ టేకింగ్ ఆకట్టుకుంటుంది. ఇటీవల థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.

సలార్ (Salaar: Part 1 – Ceasefire) : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియా మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, బ్రహ్మాజి నటించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.

రవి బస్రూర్ అందించిన సంగీతం, భువన గౌడ ఫోటోగ్రఫితో పాటు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సూపర్ యాక్టింగ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తీరు, భారీ యాక్షన్ మాస్ సీన్స్ ఈ మూవీకి హైలైట్స్. మొదటి నుండి కూడా స్టోరీ లో పలు యాక్షన్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయి. అటు థియేటర్స్ లో బాగా పెర్ఫార్మ్ చేసిన సలార్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

ott release movies this week

ఆనిమల్ (Animal) : బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఆనిమల్ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి దాదాపుగా రూ. 930 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందున్న హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో అనిల్ కపూర్, శక్తి కపూర్, పృథ్వీ రాజ్ నటించారు.

అటు తన తండ్రి పై ఎంతో ఇష్టం గల కొడుకు, ఆయన పై జరిగిన హత్యాయత్నానికి దుండగుల పై ఏవిధంగా పాగా తీర్చుకున్నాడు అనే కథాంశంతో ఆకట్టుకునే రీతిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇక అటు థియేటర్స్ లో అదరగొట్టిన ఆనిమల్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో పలు భాషల్లో స్ట్రీమ్ అవుతూ అందరినీ అలరిస్తోంది.

కెప్టెన్ మిల్లర్ (Captain Miller) : కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కేయినా లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది.

ott releases this week telugu 2023

ఈ మూవీలో కెప్టెన్ మిల్లర్ గా వెర్సటైల్ యాక్టర్ ధనుష్ మరొక్కసారి తన అద్భుత నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, తెలుగు నటుడు సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించిన ఈమూవీని సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. ఇక ఇటీవల ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి వ్యూస్ తో కొనసాగుతోంది.

అయలాన్ (Ayalaan) : కోలీవుడ్ యువ నటుడు శివ కార్తికేయన్ హీరోగా ఆర్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ అయలాన్. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించారు.

అనుకోకుండా ఆకాశంలోని ఒక గ్రాహం నుండి వచ్చే అంతరీక్షవాసి తో హీరో స్నేహం చేయడం, అసలు అది ఎందుకు వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ కథాంశంతో దర్శకుడు రవికుమార్ అయలాన్ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ మూవీ ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని అతి త్వరలో ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

ott releases this week

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ott releases this week

2 thoughts on “OTT Releases This Week l ఈవారం ఓటిటిలో రిలీజ్ అయ్యే మూవీస్ 2024”

Comments are closed.