Guntur Kaaram Collection Worldwide:- సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న రిలీజ్ అయి మొదట మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే మూవీ ఎంతో బాగున్నప్పటికీ కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో అలానే యూట్యూబ్ లో పూర్తిగా నెగటివ్ గా ప్రచారం చేయడంతో సినిమాకి చాలా దెబ్బ పడింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకు అన్ని వర్గాల ఆడియన్స్ లో తిరుగులేని స్టార్డం ఉన్న విషయం తెలిసిందే.
Guntur Kaaram Collection Worldwide
ఆయన స్టార్ పవర్ తో పాటు సినిమా కంటెంట్ కూడా బాగుండడంతో నెగటివిటీ ని తట్టుకుని మెల్లగా కలెక్షన్స్ పుంజుకున్నాయి. ఇక సంక్రాంతి సందర్భంగా ఈమూవీ అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో కలెక్షన్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించగా ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.
Guntur Kaaram Collection Worldwide
థమన్ సంగీతం అందించిన గుంటూరు కారం మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రఘుబాబు, ఈశ్వరి రావు, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం మొత్తంగా గడచిన ఐదు రోజుల్లో ఈ మూవీ రూ. 206 కోట్ల గ్రాస్ ని అలానే రూ. 103 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెల్ బౌండింగ్ పెర్ఫార్మన్స్ కి త్రివిక్రమ్ సూపర్ టేకింగ్ తోడవడం తో పాటు ఎస్ థమన్ అద్భుతమైన సాంగ్స్, బ్యాక్ గ్రౌడ్ స్కోర్, మనోజ్ పరమహంస గ్రాండియర్ విజువల్స్ వెరసి గుంటూరు కారణ మూవీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేస్తోంది. మొత్తంగా ఈ మూవీ సంక్రాంతి సీజన్ అనంతరం కూడా బాగానే కలెక్షన్ ని రాబట్టే అవకాశం కనపడుతోంది.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి