Shocking Response for Salaar Release Trailer:- మన టాలీవుడ్ డార్లింగ్ హీరో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ మూవీని ప్రముఖ నిర్మాత విజయ్ కిరాగందూర్ తన హోంబలె ఫిలిమ్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 22న ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ మొత్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. నిజానికి ప్రారంభం సమయం నుండి అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇటు నార్మల్ ఆడియన్స్ లో కూడా సలార్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఈ మూవీలో అందాల కథానాయిక శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ నటుడు టిన్ను ఆనంద్ వంటి వారు నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి కూడా కెజిఎఫ్ సినిమాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. విషయం ఏమిటంటే, ఇటీవల సలార్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ఫస్ట్ సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ ఇలా అన్ని కూడా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించి సూపర్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాయి.
Shocking Response for Salaar Release Trailer
ఇక తాజాగా సలార్ నుండి మేకర్స్ రిలీజ్ ట్రైలర్ ని కూడా ఐదు భాషల్లో విడుదల చేసారు. నిజానికి ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఎక్కువగా ఎమోషనల్ కంటెంట్ ఉండడంతో రిలీజ్ ట్రైలర్ లో భారీగా యాక్షన్ సీన్స్ ని జతచేసారు. కాగా ప్రస్తుతం ఈ రిలీజ్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా యువత తో పాటు మాస్ ఆడియన్స్ నుండి ఈ రిలీజ్ ట్రైలర్ కి మరింత మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే మ్యాటర్ ఏమిటంటే, ప్రస్తుతం సలార్ రిలీజ్ ట్రైలర్ ఐదు భషాల్లో కలిపి ఏకంగా 101 మిలియన్ వ్యూస్ ని అలానే 1.6 మిలియన్ కి పైగా లైక్స్ ని సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.
ఈ మూవీ యొక్క రిలీజ్ ట్రైలర్ ని బట్టి చూస్తుంటే తప్పకుండా ఈ మూవీతో మన డార్లింగ్ ప్రభాస్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనపడుతోంది. మరోవైపు సలార్ కి ఏ సెర్టిఫికెట్ లభించప్పటికీ కూడా తాము ఏమాత్రం నిరాశ చెందడం లేదని అంటోంది యూనిట్. దానికి కారణం సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ లో ఎక్కడదు కూడా అసభ్యకర సన్నివేశాలు లేవని, అయితే కొన్ని సన్నివేశాల్లో వయొలెన్స్ ఎక్కువగా ఉండడమే వల్లనే సెన్సార్ వారు ఏ సెర్టిఫికెట్ అందించడం జరిగిందని వారు అంటున్నారు. మరి అందరిలో ఆకాశమే హద్దుగా హైప్ ఏర్పరిచిన సలార్ మూవీ డిసెంబర్ 22న పలు భాషలలో రిలీజ్ అనంతరం ఎంత మేర ఆడియన్స్ నుండి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
1 thought on “Shocking Response for Salaar Release Trailer l వామ్మో సలార్ రిలీజ్ ట్రైలర్ కి ఇదేమి రెస్పాన్స్ స్వామి 2023”
Comments are closed.